Share News

వేడుకగా అమ్మవారి జాతర్లు

ABN , Publish Date - May 19 , 2024 | 11:56 PM

గ్రామీణ ప్రాంతాల్లో సకాలంలో వర్షాలు పడి పాడిపంటలతో పల్లెసీమలు కలకలలాడాలని కోరుకుంటూ అమ్మవార్లకు జాతర్లు చేస్తారు.

వేడుకగా అమ్మవారి జాతర్లు
ములకలచెరువులో ముత్యాలమ్మకు బోనాలు తీసుకెళ్తున్న మహిళలు

పీలేరులో ఉలవల గంగమ్మ జాతర, వాల్మీకిపురంలో నల్లవీర గంగాభవాని జాతర ములకలచెరువులో ముత్యాలమ్మ తిరుణాల

పీలేరు, మే 19: గ్రామీణ ప్రాంతాల్లో సకాలంలో వర్షాలు పడి పాడిపంటలతో పల్లెసీమలు కలకలలాడాలని కోరుకుంటూ అమ్మవార్లకు జాతర్లు చేస్తారు. ఇందులో భాగంగానే ఈ ఆదివారం పలుల మండలా ల్లో అమ్మవార్లకు ప్రత్యేకంగా జాతర్లు నిర్వహించారు. పీలేరు-తలపుల మార్గంలోని ఉలవల గంగమ్మ జాతర ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే జాతరలో ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమం ఆలయ పూజారి ప్రకాశ, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వెంకటరమణ నాయుడు భక్తుల సమక్షంలో నిర్వహించారు. అప్పటికే అమ్మవారికి బోనాలు సమర్పించుకునేందుకు తలపుల, మేళ్లచెరువు గ్రామాల ప్రజలు పెద్దఎత్తున తరలి రావడంతో జాతర కోలాహలం మొదలైంది. అమ్మవారి దర్శనంతోపాటు జాతర సందర్భంగా మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

ములకలచెరువులో వైభవంగా ముత్యాలమ్మ తిరుణాల

ములకలచెరువు, మే 19: మండలంలోని బురకాయలకోట సమీపంలో వెలసిన ముత్యాలమ్మ అమ్మవారి తిరుణాల ఉత్సవాలు వైభవంగా ప్రా రంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన ఆదివారం మహా భిషేకము, కూష్మాండబలి, కుంకమార్చన కార్యక్రమాలు జరిగాయి. మహిళలు పెద్ద ఎత్తున ఊరేగింపుగా బోనాలు, జ్యోతులు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. పిండి దీపాలు వెలిగించి మొక్కుబడులు తీర్చుకున్నారు. కళాకా రులు నిర్వహించిన పండరి భజనలు, చెక్క భజనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాల్లో బురకాయలకోట, మద్దినా యనిపల్లె, వేపూరికోట గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

వైభవంగా నల్లవీర గంగాభవానీ జాతర

వాల్మీకిపురం, మే 19: వాల్మీకిపురం పట్టణంలోని రైల్వే స్టేషన సమీపం లో వెలసిన నల్లవీర గంగాభవానీ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం చాటింపుతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆల యంలో మూలవిరాట్‌ అమ్మవారికి అభిషేకం, అర్చన, తోమాల సేవలతో ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు జల కళశాలతో పట్టణ పురవీధు లలో ప్రదర్శనగా వెళ్లి స్థానిక బజారు వీధి, నాయక్‌వీఽధులలో గల గం గరాళ్లకు జలాభిషేకాలు నిర్వహించి పూజలు చేస్తూ మొక్కులు తీర్చు కున్నారు. ఈసందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించగా, భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమాలలో ఆలయ ధర్మకర్త రమణారెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన రామ్‌కుమార్‌రెడ్డి, అర్చకు లు జనార్దనస్వామి, విజయ్‌కుమార్‌, కమిటీ సభ్యులు ఆనందశెట్టి, బలరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

మల్లాలమ్మ దేవతకు ప్రత్యేక పూజలు

పెద్దమండ్యం, మే 19: మండలంలోని సి.గొల్లపల్లె పంచాయతీ రెక్కల కొండలో ప్రసిద్ధి చెందిన రెక్కలకొండ గ్రామ దేవత మల్లాలమ్మకు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి కి పూజలు, అభిషేకాలు నిర్వహించి వివిధ పుష్పాలతో అలం కరించా రు. అనంతరం అన్నదానం చేశారు. గర్భాలయాన్ని రెక్కలకొండపల్లెకు చెందిన గొర్ల చంద్రశేఖర్‌ కుటుంబసభ్యులు నూతనంగా ఏర్పాటు చేశా రు. స్థానిక సర్పంచ విశ్వనాథరెడ్డి, ఉప సర్పంచ గొర్ల అమర్‌నాథ్‌, ఆల య చైర్మన పుల్లారెడ్డి, పూజారి గోవిందు, ఉదయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

సాధుచెట్టి సంఘం జాతర వేడుకలు

బి.కొత్తకోట, మే19: బి.కొత్తకోట పట్టణంలో సాధుచెట్టి సంఘం జాతర వేడుకలు ఆదివారం వైభవంగా ప్రారంభించారు. మూడురోజుల పాటు ఈ వేడుకలు అట్టహాసంగా నిర్వహించనున్నారు. పట్టణంలోని జను పువీధిలో ఉన్న గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేశారు. భక్తులు విచిత్ర వేషధారణలలో అమ్మ వారికి మొక్కులు తీర్చుకున్కారు. ఆలయం వద్ద తీర్థ ప్రసాదాలు, అన్న సంతర్పణ కార్యక్రమాలు నిర్వహించారు.

Updated Date - May 19 , 2024 | 11:56 PM