Share News

సామాజిక మార్పునకు అర్థం అంబేడ్కర్‌

ABN , Publish Date - Apr 14 , 2024 | 11:28 PM

బహుముఖ వ్యక్తిత్వం కలిగి న న్యాయ నిపుణుడు, విద్యావేత్త, ఆర్థిక వేత్త, సామాజి క సంస్కర్తగా దేశానికి, సమాజానికి విశేషమైన కృషి చేసిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ సామాజిక మార్పునకు మార్గదర్శకుడని అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు, వైవీయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసరు వైపీ వెంకటసుబ్బయ్య వేర్వేరు కార్యక్రమాల్లో కొనియాడారు.

సామాజిక మార్పునకు అర్థం అంబేడ్కర్‌

అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయం, కడప వైవీయూ, ఆర్కిటెక్చర్‌ వర్సిటీల్లో అంబేడ్కర్‌ జయంతి

రాయచోటిటౌన్‌, ఏప్రిల్‌14: బహుముఖ వ్యక్తిత్వం కలిగి న న్యాయ నిపుణుడు, విద్యావేత్త, ఆర్థిక వేత్త, సామాజి క సంస్కర్తగా దేశానికి, సమాజానికి విశేషమైన కృషి చేసిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ సామాజిక మార్పునకు మార్గదర్శకుడని అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు, వైవీయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసరు వైపీ వెంకటసుబ్బయ్య వేర్వేరు కార్యక్రమాల్లో కొనియాడారు.

అన్నమయ్య జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో భారతరత్న అంబేడ్కర్‌ జయంతి సం దర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి నివాళులర్పిం చిన ఎస్పీ మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆలోచనలు రాబో యే తరాలకు కూడా మార్గదర్శకమన్నారు. అంటరానిత నం, సామాజిక అసమానతలు పోగొట్టిన మహోన్నత మైన వ్యక్తిగా అంబేడ్కర్‌ను అభివర్ణించారు. రాజ్యాంగం ద్వారా సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు దిశానిర్దేశ కుడిగా చరిత్రలో నిలిచారని స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితం అవుదామని ఎస్పీ పోలీసు అధికారులకు, సిబ్బందికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్పీ, అదనపు ఎస్పీ డాక్టర్‌ వీబీ రాజ్‌కమల్‌, ఏఆర్‌ డీఎస్పీ చిన్నికృష్ణ, సీఐ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ అడ్మిన్‌ శ్రీనివాసులు, హోంగార్డ్స్‌ ఆర్‌ఐ చలపతి, ఆర్‌ఐ ఎంటీఓ పెద్దయ్య, పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వైవీ యూనివర్సిటీలో....

కడప (ఎడ్యుకేషన్‌), ఏప్రిల్‌ 14: వైవీయూలో ఆదివా రం అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించిన రిజిస్ట్రా ర్‌ ప్రొఫెసరు వైపీ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం అలుపెరగని పోరాటం చేశారన్నారు. ప్రిన్సిపల్‌ ప్రొఫెసరు రఘునాధరెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్‌ ఈశ్వర్‌రెడ్డి, డీఎన్‌ ఏజీ దాము, కామర్స్‌ మేనేజ్‌మెంటు విభాగం డీన్‌ ప్రొఫెసరు వై.సుబ్బరాయుడు మాట్లాడా రు. కార్యక్రమంలో అసోసియేట్‌ ప్రొఫెసరు గంగయ్య, బోధన బోధనేతరసిబ్బంది పాల్గొన్నారు.

ఏఎ్‌ఫఏయూలో...

భారతరాజ్యాంగానికి రూపకల్పన చేసిన అంబేడ్కర్‌ దేశానికే గర్వకారణమని, ప్రముఖ న్యాయవాదిగా చిరస్మరణీయుడని డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ ఆర్కిటెక్చర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ వీసీ సురేంద్రనాధరెడ్డి తెలిపారు. అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో భాగంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్‌ రాజే్‌ష కుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ పవన్‌కుమార్‌రెడ్డి, కోఆర్డినేటరు మనోహర్‌రావు, ఎన్‌ఎ్‌సఎస్‌ పీఓలు ప్రదీ్‌పకుమార్‌, ఉదయ్‌ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.

ఆర్‌జేడీ ఆధ్వర్యంలో...

కడప నగరం కలెక్టరేట్‌ కార్యాలయంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి ఆర్‌జేడీ వై.రాఘవరెడ్డి నివాళులర్పించారు. కలెక్టరేట్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి ఎస్టీఎఫ్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.రామాంజనేయులు ఘనం గా నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర నేతలు తు పాకుల మురళి, ఎ.రామచంద్ర, ఎం.వెంకటసుబ్బయ్య, క్రిష్ణఫర్‌జాన్‌, రాజగోపాల్‌రెడ్డి, పలువురు తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ ఆశయాలను కొనసాగిద్దాం

అంబేడ్కర్‌ ఆశయాలను కొనసాగిద్దామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివా రం కడప నగరం కలెక్టరేట్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. సామజిక న్యాయం, సమానత్వానికి అంకితమైన గొప్ప వ్యక్తిడాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ ఎస్సీసెల్‌ నేతలు ఇల్లూరు ఓబులేసు, ఎస్టీ సెల్‌ భాస్కర్‌, రాజశేఖర్‌, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ, ముద్దనూరు రాయుడు, బీసీ సెల్‌ నాయకులు వెంకటసుబ్బయ్య, వెంకటరమణ, వెంకటసుబ్బయ్య, జీవన్‌, అనిల్‌, బిల్లా నవీన్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 11:28 PM