Share News

పోలింగ్‌కు సర్వం సిద్ధం

ABN , Publish Date - May 12 , 2024 | 11:33 PM

మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజ కవర్గాల్లో సోమవారం జరుగనున్న పోలింగ్‌నకు అధికారులు ఏర్పా ట్లు సర్వం సిద్ధం చేశారు.

పోలింగ్‌కు సర్వం సిద్ధం
మదనపల్లె జడ్పీ హైస్కూల్‌ నుంచి ఎన్నికల సామగ్రి తీసుకెళ్తున్న పోలింగ్‌ అధికారులు మదనపల్లె జడ్పీహైస్కూల్లో పోలింగ్‌ సిబ్బందికి సూచనలిస్తున్న రిటర్నింగ్‌ అధికారి హరిప్రసాద్‌

మదనపల్లె టౌన, మే 12: మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజ కవర్గాల్లో సోమవారం జరుగనున్న పోలింగ్‌నకు అధికారులు ఏర్పా ట్లు సర్వం సిద్ధం చేశారు. మదనపల్లె నియోజకవర్గంలో మొత్తం 2,66,590ఓట్లు ఉండగా వారిలో అత్యథికంగా మహిళా ఓటర్లు 1,36,078 ఓటర్లు ఉన్నారు. పురుషులు 1,31,460 ఓటర్లు ఉండగా ఇతరులు(ట్రాన్సజెండర్లు) 51 మంది ఓటర్లు ఉన్నారు. మదనపల్లె నియోజవకర్గంలో మదనపల్లె మున్సిపాలిటితో పాటు మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం మండలాల్లో 259 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద మౌలిక వసతులు, విద్యుతసరఫరా, బ్యారికేడ్లు, ఓటర్ల నీడకల్పించేందుకు షామియానా లు ఏర్పాటు చేశారు. 259 పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వహిం చేందుకు 312 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 312 సహాయ ప్రిసై డింగ్‌ అధికారులు, 1248 మంది ఓపీవోలు, 54 మంది మైక్రో అబ్జర్వ ర్లు విధులు నిర్వహించనున్నారు. అలాగే పోలింగ్‌ సరళిని వీడియో చిత్రీకరించేందుకు 19 మంది వీడియోగ్రాఫర్లను నియమించారు. దీంతో పాటు 259 పోలింగ్‌ కేంద్రాలను 38 సెక్టార్లుగా విభజించి, 38 రూట్లలో 38 మంది సెక్టోరియల్‌ అధికారుల పర్యవేక్షణలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. మొత్తం కలిపి 2308 మంది అధికారులు పోలింగ్‌ విధుల్లో పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా నియోజకవర్గం లో 161 పోలింగ్‌ కేంద్రాలలో వెబ్‌క్యాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. అలాగే 46 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి అక్కడ అదనపు పోలీసు బలగాలను నియమించారు. ఇకపోతే స్థానిక జడ్పీ హైస్కూల్లో రిజర్వుడుగా 32 మంది ప్రిసైండింగ్‌ అధికారులు, 32 మంది ఏపీవోలు, 132 మంది ఓపీవోలు, ఆరుగురు మైక్రో అబ్జర్వర్లు అందుబాటులో ఉంచారు. విధి నిర్వహణలో ఎవరికైనా ఆరోగ్య సమ స్యలు వస్తే వారి స్థానంలో రిజర్వుడు అధికారులు వెళ్లి బాధ్యతలు చేపడతారు. కాగా మదనపల్లె జడ్పీహైస్కూల్‌ నుంచి 38 బస్సుల్లో పోలింగ్‌ అధికారులు వారికి కేటాయించిన ఈవీఎంలు, వీవీప్యాట్‌, కంట్రోల్‌ యూనిట్‌, పోలింగ్‌ బూత పెట్టెలు తీసుకెళ్లారు. మదనపల్లె అసెంబ్లీ(164 ఏపీఎల్‌ఏ) నియోజకవర్గంతో పాటు రాజంపేట పార్ల మెంట్‌(24 హెచవోపీ) నియోజకవర్గం పరిధిలో ఓట్ల పండుగకు రిటర్నింగ్‌ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం స్థానిక జడ్పీహైస్కూల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో పోలింగ్‌ సిబ్బందికి ఈవీఎంలు, కంట్రోల్‌ యూనిట్‌లు, వీవీప్యాట్‌ మిషన్లను పంపిణీ చేశారు. దీంతో పాటు పోలింగ్‌కు అవసరమైన పెన్నులు, పేపర్లు, సిరా తదితర వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. రిటర్నింగ్‌ అధికారి హరిప్రసాద్‌ ఆధ్వర్యంలో నలుగురు ఏఆర్‌వోలు, 38 మంది సెక్టోరియల్‌ అధికారులు పోలింగ్‌ సిబ్బందికి పలు సూచనలు అంద జేశారు. సోమవారం ఉదయం 5.30గంటలకే పోలింగ్‌ ఏజెంట్ల సమ క్షంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలన్నారు. 50 ఓట్లను వేసి, వాటిని లెక్కించి, వీవీ ప్యాట్‌లో చీటిలు 50 వచ్చాయా..? లేదా సరిచూసు కోవాలన్నారు. అనంతరం ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎం, వీవీప్యాట్‌ యంత్రాలకు సీల్‌ వేసి ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలన్నారు. నిర్దేశిత సమయానికి పోలింగ్‌ ప్రారంభించి, గంట గంటకు ప్రిసైడిం గ్‌ అధికారుల మొబైల్‌ఫోనలో డౌనలోడ్‌ చేసుకున్న పీడీఎంఎస్‌ యాప్‌లో పోలింగ్‌ వివరాలను అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే సెక్టోరియల్‌ అధికారులకు తెలిపి, వారి వద్ద రిజర్వులో వున్న ఈవీఎంలను మొరాయించిన ఈవీఎం స్థానంలో మార్చి పోలింగ్‌ నిర్వహించాలన్నారు. పోలింగ్‌ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్‌ అధికారి సూచించారు.

తంబళ్లపల్లెలో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌

ములకలచెరువు/తంబళ్లపల్లె/కురబలకోట,మే12:తంబళ్లపల్లె నియో జకవర్గంలో సోమవారం పోలింగ్‌నకు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశా రు. కురబలకోట మండలం అంగళ్ళు మిట్స్‌ కళాశాల నుంచి ఈవీ ఎంలు, పోలింగ్‌ అధికారులు, సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు చేరుకు న్నారు. మిట్ప్‌ కళాశాలలో ఉన్నతాధిరులు పోలింగ్‌ అధికారులు, సిబ్బందికి విధులు కేటాయించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో మొత్తం 236 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా ఎన్నికల సంఘం నియో జకవర్గం సమస్యాత్మకంగా గుర్తించడంతో అన్ని కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ నడుమ పోలింగ్‌ జరప నున్నారు. అలాగే కేంద్ర బలగాలు పోలింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించనున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో మొత్తం 2,24,124 మంది ఓటర్లు ఉండగా ఇందు లో 1,10,308 మంది పురుషులు, 1,13,804 మంది మహిళలు, 12 మంది ట్రాన్స జండర్లు ఉన్నారు. నియోజకవర్గంలోని ములకలచెరు వు, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, పెద్దతిప్పసముద్రం, కురబలకోట, బి.కొత్తకోట మండలాల్లోని అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద మండల స్ధాయి అధికారులు, సిబ్బంది బ్యారికేడ్లు, తాగునీటి వసతి, లైట్లు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన అమలులోకి తెచ్చారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగ నుంది. నియోజకవర్గంలోని ఆరు మండలాల పోలిం గ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ ఆఫీసర్లు 284, అసిస్టెంట్‌ పోలింగ్‌ ఆఫీసర్లు 284, ఓపీవోలు 1136 మంది మైక్రో అబ్జర్వర్లు 70 మంది విధులు నిర్వర్తిస్తారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్‌వో రాఘవేంద్ర తెలిపారు. ఆదివారం కురబలకోట మండలం మిట్స్‌ కళాశాల(సా్ట్రంగ్‌ రూం) నుంచి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని 236 పోలిం గ్‌ కేంద్రాలకు పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ ఈవీఎంలు, వీవీప్యాడ్లు ఇతర ఎన్నికల సామాగ్రిని ఎన్నికల సిబ్బంది ద్వారా తరలించారు. నియోజకవర్గంలోని 37 సెక్టార్లలో సుమారు 3 వేల మందికి పైగా పీవో, ఏపీవో, బీఎల్వోలు, రెవెన్యూ సిబ్బందితో పోలింగ్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. విభిన్న ప్రతిభావంతులు వంద శాతం ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్‌ కేంద్రాల వద్ద ర్యాంపు, వీల్‌ చైర్స్‌తో పాటు బీఎల్వో, వీఆర్‌ఏ లను వారికి సహాయకులుగా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మాక్‌ పోలింగ్‌ అనంతరం ఓటింగ్‌ పక్రియ మొదలవు తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కురబ లకోట మండలంలోని అంగళ్ళు సమీపంలోని మిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎన్నికల సామాగ్రిని స్ర్టాంగ్‌ రూముల నుంచి తెప్పించి ఎన్నికల సిబ్బందికి పంపిణీ చేశారు. వీటిని సంబంధించి కేంద్ర ఎన్నికల అబ్జర్వర్‌ కవిత తనిఖీ చేశారు. కాగా ఆర్వో రాఘవేంద్ర డీపీవో ధనలక్ష్మిలు సిబ్బందికి విధులను కేటాయించారు. కాగా తంబళ్ళపల్లె నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని పోలింగ్‌ కేంద్రాలు సమ స్యాత్మకంగా ఎన్నికల అధికారులు ఎంపిక చేయడంతో వెబ్‌కాస్టింగ్‌ నిఘూ నీడలో నిర్వహించనున్నారు.

ఓట్ల పండుగకు సర్వం సిద్ధం

పీలేరు, మే 12: సార్వత్రిక ఎన్నికల్లో కీలక అంకమైన పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పీలేరు అసెంబ్లీ నియోజక వర్గానికి స్థానిక సంజయ్‌ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రంలో ఆదివారం ఉదయం నుంచి నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన అహ్మద్‌ ఖాన పర్యవేక్షణలో సిబ్బందికి ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ మెషీన్లతోపాటు ఇతర స్టేషనరీ సామాగ్రిని ఆయన పోలింగ్‌ బూతల వారీగా పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విధులకు హాజరైన ఉద్యోగు లతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు ఆదివారం రాత్రికే చేరుకుని అక్కడి పరిస్థితులను అవగాహన చేసుకుని సోమవారం ఉదయం 5.30 గంటలకే పోలిం గ్‌కు సమాయత్తం కావాలని ఆదేశించారు. అనంతరం సిబ్బంది తవ ుకు కేటాయించిన వాహనాల్లో సామగ్రితో తరలి వెళ్లారు. మదనపల్లె మార్గంలోని ఓ ఫంక్షన హాలులో ఎన్నికల విధులకు హాజరైన స్థానిక సిబ్బంది, కేంద్ర బలగాలు, తమిళనాడు రాష్ట్ర పోలీసులతో జిల్లా ఎస్పీ కృష్ణారావు సమీక్షించారు. పీలేరు నియోజకవర్గమంతటా చిన్న అలజడి కూడా లేకుండా ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పాటుపడా లని, ఎక్కడ ఏ చిన్న అపశృతి దొర్లినా వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింట్‌ ఉంటుందని, పోలింగ్‌ బూతలలో ఏ చిన్న పొరపాటు జరిగినా వెంటనే ఉన్నతాధికారులు తెలిసిపోతుందన్నారు. పోలింగ్‌ బూతలలో ఎక్కడ ఏ చిన్న అల్లరి జరిగినా క్షణాల్లో స్పందించే విధంగా రూట్‌మ్యాప్‌ తయారు చేశామన్నారు. పోలింగ్‌ ముగిసిన తరువాత ఉన్నతాధికారుల ఆదేశాలు అందే వరకు పోలింగ్‌ కేంద్రా లు విడిచిపెట్టి రావొద్దని ఆయన సిబ్బందిని ఆదేశించారు. పీలేరు నియోజకవర్గంలో 2,34,608 మంది ఓటర్లు ఉండగా పురుషులు 114962, మహిళలు 119624 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు 5614 మంది ఉండగా ప్రత్యేక ప్రతిభావంతులు 3449 మంది ఉన్నారు. 85 ఏళ్లు పైబడిన వారు 1698 మంది ఉన్నారు. 281పోలింగ్‌ కేంద్రాలు ఉండగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. 79 సమస్మాత్మక పోలింగ్‌ కేంద్రాలను అధికారులు గుర్తించి అందుకు తగిన ఏర్పాటు చేశారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో ఈఆర్‌ వో రమ, ఏఈఆర్‌వో మహబూబ్‌ బాషా, ఏఎస్‌వో రామ్మోహన, డీఎస్పీ రామచంద్ర రావు, సీఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ విక్రమ్‌, సీఐ మోహన రెడ్డి పాల్గొన్నారు.

గుర్రంకొండలో:ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా విని యోగించుకోనేలా పోలింగ్‌ కేంద్రాలను అధికారులు సిద్దం చేశారు. గుర్రంకొండ మండలంలో 43 పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని వసతులను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలకు ఎన్నికల సామగ్రితో అధికారు లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. కేంద్రాల వద్ద ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వేసేలా ఏర్పాట్లు చేశారు.

వాల్మీకిపురంలో: వాల్మీకిపురం మండలం వ్యాప్తంగా 16గ్రామ పం చాయతీలకు గాను 49పోలింగ్‌ కేంద్రాలలో సోమవారం పోలింగ్‌ ప్రక్రియ జరగనుంది. మండలంలోని 20సమస్యాత్మక పోలింగ్‌ కేం ద్రాలపై అధికారులు దృష్టి సారించారు. స్థానిక అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి ఖతిజునకుఫ్రా పోలింగ్‌ కేంద్రాల ఏర్పాట్లు పరిశీలించి పలు సూచనలు చేశారు. స్థానిక సీఐ శేఖర్‌ మాట్లాడుతూ మండలంలో డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు 4,పోలీసు సిబ్బంది 150 తో పర్యవేక్షిస్తార న్నారు. సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గం టల దాకా 144సెక్షన అమలులో ఉంటుందని, ఎక్కడా నలుగురి కన్నా ఎక్కువగా గుంపులుగా ఉంటే కఠిన చర్యలు ఉంటాయన్నారు. పోలింగ్‌ ముగిసే దాకా మండలం వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్‌ బృందాల పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. వెబ్‌క్యాస్టింగ్‌ ఉన్న నేపథ్యంలో ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్దా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

కలికిరిలో: కలికిరి మండలంలో సోమవారం పోలింగ్‌ కోసం అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పీలేరు నియోజవ ర్గం మొత్తం సమస్యాత్మక నియోజకవర్గంగా ప్రకటించడంతో ప్రతి పోలింగ్‌ బూత వద్ద ఐదుగురు సీఆర్పీఎఫ్‌ జవాన్లను నియమిం చారు. వారితోపాటు స్థానిక పోలీసులు ఇద్దరిని ఏర్పాటు చేశారు. పోలింగ్‌ సిబ్బంది కూడా అన్ని కేంద్రాలకు చేరుకున్నారు. ఇక పోలింగ్‌ బూతలల్లో వెబ్‌ క్యాస్టింగ్‌ కోసం కెమెరాలను కూడా సిద్ధం చేశారు. మండలంలో మొత్తం 48 పోలింగ్‌ బూతలున్నాయి. మొత్తం 19,767 పురుషులు, 20,911 మహిళా ఓటర్లున్నారు. ఇతర ఓటర్లతో కలిపి మొత్తం 40,686 ఓట్లున్నాయి. ఉదయం 5.45 గంటలకు మాక్‌ పోలింగ్‌ ప్రారంభమవుతుంది.

నిమ్మనపల్లిలో: మండలంలో సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏఆర్‌వో బాలాజిరాజు తెలిపారు. మండలంలో 10పంచాయతీలకు గాను మొత్తం ఓటర్లు 26069మంది ఉండగా వారిలో 12813 మంది పురుషులు, 13254 మంది మహిళలు, ఇద్దరు ట్రాన్సజండర్‌లు ఉన్నారన్నారు. ఇందుకు గాను24 బూతలు ఏర్పాటు చేశామని వాటికి సంభందించి 24మంది బూతలెవల్‌ ఆపీసర్‌లు, నలుగురు సూపర్‌వైజర్‌లు, నలుగురుసెక్టోరియల్‌ ఆఫీసర్‌లు ఉన్నారన్నారు. మొత్తం 156 ఎన్నికల సిబ్బంది విధులలో చేరినట్లు తెలిపారు. ఎండ తీవ్రతను బట్టి ప్రతి పోలింగ్‌ వద్ద షామియానాలు ఏర్పాటు చేశామన్నారు. దీనితో ప్లయింగ్‌స్కాడ్‌, కేంద్ర బలగాలు విధులలో ఉన్నట్లు తెలిపారు.

పెద్దమండ్యంలో: పెద్దమండ్యం మండలంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌నకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీవో వెంకటరమణయ్య వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండ లంలో 27,691 ఓటర్లు ఉండగా 31 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద వెబ్‌ కెమోరాలను అమర్చినట్లు తెలిపారు. మదనపల్లి డీఎస్పీ ప్రసాద్‌ రెడ్డి ఆధ్వర్యం లో ఎస్‌ఐలు, కేంద్రబలగాలు తదితర శాఖల సిబ్బంది పర్యవేక్షణలో పోలింగ్‌ జరుగుతుందన్నారు.

Updated Date - May 12 , 2024 | 11:33 PM