Share News

పింఛన్ల కోసం వృద్ధుల అగచాట్లు

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:47 PM

వాల్మీకిపురంలో సోమవారం పింఛన్ల కోసం వృద్ధుల అగచాట్లు అన్నీఇన్నీ కావు.

పింఛన్ల కోసం వృద్ధుల అగచాట్లు
వాల్మీకిపురం ఇండియన బ్యాంక్‌ నందు పింఛన్ల కోసం బారులు తీరిన వృద్ధులు, లబ్ధిదారులు

వాల్మీకిపురం, జూన 3: వాల్మీకిపురంలో సోమవారం పింఛన్ల కోసం వృద్ధుల అగచాట్లు అన్నీఇన్నీ కావు. ఉదయం 8గంటల నుంచే పట్టణంలోని బ్యాంకుల వద్ద వృద్ధులు, లబ్ధిదారులు చేరుకోవడంతో బ్యాంకుల వద్ద రద్దీ నెలకొంది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో నేరుగా ఇంటింటికీ పంపిణీ చేసే పింఛన్లు కొందరికి బ్యాంకు ఖాతాలు, మరికొందరికి పంపిణీ చేయడంతో బ్యాంకుల చెంత లబ్ధిదారులు నిరీక్షించాల్సి వచ్చింది. వయస్సు మీరిన వృద్ధులకు నేరుగా ఇళ్లవద్దకే పంపిణీ చేయమని ఎన్నికల సంఘం సూచించినా ప్రభుత్వం బ్యాంకు అకౌంట్లలో లబ్ధిదారులకు పెన్షన డబ్బులు వేయడంతో బ్యాంకుల చెంత గంటల తరబడి వృద్ధులు నిరీక్షించాల్సి వచ్చింది.

Updated Date - Jun 03 , 2024 | 11:47 PM