Share News

ఉపఎన్నిక తర్వాత అదే కుటుంబానికి చుక్కెదురు

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:26 PM

బద్వేలు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీ యాలపై జిల్లా వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇందుకు కారణం లేకపోలేదు. సార్వత్రిక ఎన్నిక ల్లో గెలుపొంది ఉప ఎన్నిక అనివార్యమైతే అనం తర సార్వత్రిక ఎన్నిక అదే కుటుంబానికి విజ యం వరించదనేది నియోజకవర్గ చరిత్ర.

ఉపఎన్నిక తర్వాత అదే కుటుంబానికి చుక్కెదురు

హ్యాట్రిక్‌ ఇవ్వని బద్వేలు

ఒకేఊరునుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు

ఉద్యోగాలు వదిలి ఎమ్మెల్యేలుగా...

బద్వేలుటౌన్‌

బద్వేలు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీ యాలపై జిల్లా వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇందుకు కారణం లేకపోలేదు. సార్వత్రిక ఎన్నిక ల్లో గెలుపొంది ఉప ఎన్నిక అనివార్యమైతే అనం తర సార్వత్రిక ఎన్నిక అదే కుటుంబానికి విజ యం వరించదనేది నియోజకవర్గ చరిత్ర. బద్వే లు నియోజకవర్గం మొట్టమొదటి ఎమ్మెల్యేగా వడ్డెమాను చిదానందం 1952లో స్వతంత్ర అభ్యరి ్థగా విజయం పొందారు. అనంతరం 1963లో వడ్డెమాను చిదానందం అనంతరం ఉప ఎన్నిక జరిగినా ఆఎన్నిక వడ్డెమాను కుటుంబీకులను వరించలేదు. అటుతర్వాత దివంగత మంత్రి బిజివేముల వీరారెడ్డి వారసురాలుగా కొండ్రెడ్డి విజయమ్మ విజయం సాధించినా ఉప ఎన్నిక అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నిక వీరారెడ్డి కుటుంబాన్ని గట్టెక్కించలేకపోయింది.2021లో గుంతోటి వెంకటసుబ్బయ్య దివంగతులవడం ఆయన స్థానంలో ఆయన సతీమణి ఉప ఎన్నిక లో గెలిచింది. ప్రస్తుతం ఉప ఎన్నిక తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నిక ఇది. ప్రస్తుతం అధికార పక్షం పాలనపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత సుధారాణిని గట్టెక్కిస్తుందా లేక ఉప ఎన్నిక అనంతర సార్వత్రిక ఎన్నిక చరిత్రను పునరా వృత్తం చేస్తుందా వేచిచూడాలి.

ఒకే ఊరి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు

అట్లూరు మండలం కమలకూరు పంచాయితీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ జాబితాలో వడ్డెమాను చిదానందం 1952, 1962లో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. బి. రత్నసభాపతి 1955లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1963లో ఉప ఎన్నిక సందర్భంగా నాగిరెడ్డి సుబ్బారెడ్డి కాంగ్రెస్‌ తరపున గెలుపొందారు.

వడ్డెమాను చిదానందం

చిదానందానికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన చనిపోయిన తరువాత జరిగిన ఉప ఎన్నిక ల్లో పెద్ద కుమారుడు వడ్డెమాను వెంకట రమణారావు పోటీ చేసినా ఓడిపోయా రు. తరువాత చిదానం దం చిన్నకుమారుడు వడ్డెమాను శివరామ క్రిష్ణారావు సాధారణ ఎన్నికల్లో రెండుసార్లు బిజివేముల వీరారెడ్డిపై గెలిచారు. ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వైద్యవిధాన పరిషత్తు చైర్మన్‌గా పనిచేశారు. తన ప్రత్యర్థి వీరారెడ్డి మరణం తరువాత శివరామక్రిష్ణా రావు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

సర్పంచి మొదలు మంత్రిస్థాయికి

బిజివేముల వీరారెడ్డి 1955, 1956లలో మొదటి సారి చెన్నంపల్లె పంచాయితీ నుంచి సర్పంచిగా గెలుపొందారు. అనంతరం బద్వేలు నియోజక వర్గంలో 1967, 1972లల్లో ఆవుదూడ కాంగ్రెస్‌ తరపున గెలుపొందారు. 1983లో స్వతంత్ర అభ్య ర్థిగా, 1985, 1994, 1999 లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, వ్యవసాయశాఖ మంత్రి గా, చిన్ననీటిపారుదల శాఖా మంత్రిగా, క్యాబినె ట్‌ మంత్రిగా విధులు నిర్వహించారు. వీరా రెడ్డి మరణానంతరం వీరారెడ్డి కుమార్తె కొండ్రెడ్డి విజయమ్మ టీడీపీ నుంచి 2001లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

సర్కారు కొలువులను వదిలేశారు

బద్వేలు ఎమ్మెల్యేలుగా పోటికీ సిద్దమైన వారు పలువురు సర్కారు కొలవులను వదులుకుని వచ్చిన వారున్నారు. వారిలో కాశినాయన మండ లం వరికుంట్లకు చెందిన డీసీ గోవిందరెడ్డి గతంలో ఆర్డీఓగా పనిచేశారు. వీరు 2004లో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం బద్వేలు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంగా రిజర్వ్‌ అయిన తరువాత శ్రీకాళహస్తిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశా లలో విధులు నిర్వహిస్తున్న బద్వేలు డివిజన్‌ పోరుమామిళ్ల వాసి పీఎం కమలమ్మ తొలిసారిగా 2009లో కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా గెలు పొందారు.

2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల మున్సిపల్‌ కమిషనర్‌ గా విధులు నిర్వహిస్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేసి బద్వేలు డివిజన్‌ పోరుమా మిళ్ల వాసి తిరు వీధి జయ రాములు ఎమ్మెల్యేగా గెలు పొందా రు. బద్వేలు డివిజన్‌ పరిధి గోపవ రం మండలం వల్లెలవారిపల్లె వాసి, డాక్టర్‌గా పనిచేస్తున్న జి. వెంకట సుబ్బయ్య 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొం దారు. 2021లో ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య అనారోగ్యం తో మృతి చెందడంతో వారి సతీమణి డాక్టర్‌ దాసరి సుధ ఉపఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందారు.

హ్యాట్రిక్‌ ఇవ్వని నియోజకవర్గం

బద్వేలు నియోజకవర్గా న్ని అతిరధమహారధులు పాలించినా ఎవరికీ హాట్రిక్‌ గెలుపు దక్కలేదు. మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలిచిన స్వతంత్ర అభ్యర్థి వడ్డెమాను చిదానందం రెండు పర్యాయాలు మాత్రమే గెలుపొందారు. అనంతర ఎన్నికల్లో వడ్డెమాను చిదానందం పెద్ద కుమారుడు వడ్డెమాను వెంకట రమణారావు ఎన్నికల్లో రాణించలేక పోయినా రెండో కుమారుడు వడ్డెమాను శివరా మ కృష్ణారావు మరో రెండు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో వడ్డెమాను కుటుంబీకులు మొత్తం నాలుగు పర్యాయాలు బద్వేలు పాలిం చారు. తర్వాత బిజివేముల వీరారెడ్డి దివంగతుల య్యాక వడ్డెమాను శివరామకృష్ణారావు రాజకీయాల నుంచి వైదొలిగారు. సర్పంచి స్థాయి నుంచి రాజకీయాలు చేసిన బిజివేముల వీరారెడ్డి మంత్రిగా రాణించినా గెలుపులో హాట్రిక్‌ సాధిం చలేక పోయారు. వీరారెడ్డి ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన తర్వాత ఆయన కుమార్తె కొండ్రెడ్డి విజయమ్మ ఒక పర్యాయం ఎమ్మెల్యేగా గెలవడంతో వీరారెడ్డి కుటుంబీకులు మొత్తం ఏడుపర్యాయాలు విజయం పొందారు.

సంవత్సరం విజేత పార్టీ

1952 వడ్డెమాను చిదానందం స్వతంత్ర

1955 బండారు రత్నసభాపతి ప్రజాసోషలిస్ట్‌

1962 వడ్డెమాను చిదానందం స్వతంత్ర

1963 నాగిరెడ్డి సుబ్బారెడ్డి కాంగ్రెస్‌ ఉప ఎన్నిక

1967 బిజివేముల వీరారెడ్డి కాంగ్రెస్‌

1972 బిజివేముల వీరారెడ్డి కాంగ్రెస్‌

1976 వడ్డెమాను శివరామక్రిష్ణారావు జనతా

1983 బిజివేముల వీరారెడ్డి స్వతంత్ర

1985 బిజివేముల వీరారెడ్డి టీడీపీ

1989 వడ్డెమాను శివరామక్రిష్ణారావు కాంగ్రెస్‌

1994 బిజివేముల వీరారెడ్డి టీడీపీ

1999 బిజివేముల వీరారెడ్డి టీడీపీ

2001 కొండ్రెడ్డి విజయమ్మ టీడీపీఉపఎన్నిక

2004 దేవసాని చిన్నగోవిందరెడ్డి కాంగ్రెస్‌

2009 పీఎం కమలమ్మ కాంగ్రెస్‌

2014 తిరువీధి జయరాములు వైసీపీ

2019 గుంతోటి వెంకటసుబ్బయ్య వైసీపీ

2021 డాక్టర్‌ దాసరి సుధారాణి వైసీపీ ఉపఎన్నిక

Updated Date - Apr 19 , 2024 | 11:26 PM