Share News

విద్యుత సమస్యలపై అలసత్వం వహిస్తే చర్యలు : ఎస్‌ఈ

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:52 PM

నిర్దేశిత పోలింగ్‌బూతల వద్ద ట్రాన్సఫార్మర్లు, లైన్లకు మరమ్మతులు చేసి అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యుతశాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీరు రమణ అన్నారు.

విద్యుత సమస్యలపై అలసత్వం వహిస్తే చర్యలు : ఎస్‌ఈ
విద్యుత సిబ్బందికి సూచనలు ఇస్తున్న ఎస్‌ఈ రమణ

పోరుమామిళ్ల, ఏప్రిల్‌ 16 : నిర్దేశిత పోలింగ్‌బూతల వద్ద ట్రాన్సఫార్మర్లు, లైన్లకు మరమ్మతులు చేసి అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యుతశాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీరు రమణ అన్నారు. మంగళవారం ఆయన పోరుమామిళ్లలోని 33/11 కేవీ సబ్‌స్టేషన ట్రాన్సఫార్మర్లు, లైన్లు క్షేత్రస్థాయిలో ఆయనే స్వయంగా తిరిగి పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. పోరుమామిళ్ల సబ్‌ డివిజను పరిధిలోని పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన, బి. కోడూరు మండలాల క్షేత్ర స్థాయి అధికారులు సిబ్బందితో పోరుమామిళ లోని సీసీఆర్‌ కాంప్లెక్స్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటి ఎద్దడి కారణంగా నీటి పథకాల కొత్త పనులు, మరమ్మ తులను అత్యధిక ప్రాధాన్యతతో యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కరెం టు పోయి ప్రజలు భరించలేని స్థితిలో ఉన్నప్పుడు విద్యుత సమస్యలపై వెంటనే స్పందించాలన్నారు. వేసవిలో విద్యుత వినియోగం అధికంగా ఉంటుందని, లో ఓల్జేజీ సమస్య అధిగమించేందుకు కొత్త ట్రా్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఉద్యోగి జవాబుదారీతనంతో పనిచేయాల న్నారు. వినియోగదారులకు విద్యుత అంతరాయం లేకుండా చేయాలనే తలంపుతో సిబ్బంది పనిచేయాలన్నారు. ట్రాన్సఫార్మర్లు, లైన్లను ఉద్యోగులు తన సొంత ఆస్తిగా భావించాలన్నారు. మీటర్లను ఇంటిలోపల కాకుండా బయట బిగించాలన్నారు. వీధిలైట్లు పగటిపూట వెలుగుతున్నాయని, సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. ఒక్క యూనిట్‌ కూడా విద్యు త వృథా కాకూడదన్నారు. విద్యుత బకాయిల వసూళ్లలో రాజీ పడవద్దని విద్యుత బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. విద్యుత చౌర్యం అరికట్టాలని, వాలిపోయిన స్తంభాలు, వేలాడుతున్న తీగెలను సరిచేయా లన్నారు. విద్యుత పనులు చేసేటప్పుడు భద్రతా నియమాలు పాటించా లన్నారు. వ్యవసాయ అధారిత ప్రాంతాల్లో రైతులు తామే ట్రాన్సఫార్మర్ల ఫీజులు మార్చడం వటి పనులపై స్పందించాలన్నారు. విద్యుత వినియోగ దారుడికి సమస్యలు వచ్చినప్పుడు సిబ్బంది వెంటనే పరిష్కరించాలన్నరు. కడప సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసరు మధు, అకౌంటు ఆఫీసరు మల్లికార్జున, మైదుకూరు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు శ్రీనివాసులరెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు నాయక్‌, ఏఏవో శివకుమార్‌, పోరుమామిళ్ల ఏఈ వెంకట మహేశ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 11:52 PM