Share News

పర్యావరణానికి హాని కలిగిస్తే చర్యలు : డీఆర్‌వో

ABN , Publish Date - Aug 21 , 2024 | 11:34 PM

పర్యావరణా నికి హాని కలిగిస్తే చర్యలు తప్పవని జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణ హెచ్చ రించారు

పర్యావరణానికి హాని కలిగిస్తే చర్యలు : డీఆర్‌వో
మాట్లాడుతున్న డీఆర్‌వో సత్యనారాయణ

మదనపల్లె టౌన, ఆగస్టు 21: పర్యావరణా నికి హాని కలిగిస్తే చర్యలు తప్పవని జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణ హెచ్చ రించారు. బుధవారం మండలంలోని కోటా రుపల్లె పంచాయతీ ఉడుంవారిపల్లె వద్ద గ్రానైట్‌ క్వారీయింగ్‌పై స్థానిక ప్రజలతో పర్యావరణ ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వారీతోపాటు , సమీపంలోని రహదారుల్లో దుమ్ము, ధూళి లేవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దారికి ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. పెద్దఎత్తున శబ్దాలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. క్వారీ చుట్టుపక్కల పొలాలు, చెరువులు కాలుష్యం బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మైనింగ్‌పై ప్రజల నుంచి ఏవైనా అభ్యంతరాలు వస్తే మైన యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆరు నెలలకు ఒకసారి శబ్ద, వాయు, నీరు, మట్టి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపాలన్నారు. ఉచిత వైద్య శిబిరాలు, గ్రామాలకు తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కడప పొల్యూషన కంట్రోల్‌ బోర్డు అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్‌ ఖాజామా, క్వారా యజమాని గోపీనాఽథరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 11:34 PM