Share News

నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే చర్యలు

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:22 PM

ప్యూరిఫైడ్‌ వాటర్‌ పంపిణీలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా, అనుమతులు లేకుండా వాటర్‌ప్లాంట్స్‌ నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని మున్సిపల్‌ కమిషనర్‌ వాసుబాబు, జిల్లా ఆహార భద్రత అధికారి షమీంబాషా వాటర్‌ ప్లాంట్‌ యజమానులను హెచ్చరించారు.

నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే చర్యలు
ఆర్‌వో ప్లాంట్స్‌ నిర్వాహకుల సమావేశంలో మాట్లాడుతున్న మున్సిపల్‌ కమిషనర్‌ వాసుబాబు

అనుమతి లేకుండా వాటర్‌ ప్లాంట్‌లు నడిపితే సీజ్‌

మున్సిపల్‌ కమిషనర్‌ వాసుబాబు

రాయచోటిటౌన, ఏప్రిల్‌ 19: ప్యూరిఫైడ్‌ వాటర్‌ పంపిణీలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా, అనుమతులు లేకుండా వాటర్‌ప్లాంట్స్‌ నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని మున్సిపల్‌ కమిషనర్‌ వాసుబాబు, జిల్లా ఆహార భద్రత అధికారి షమీంబాషా వాటర్‌ ప్లాంట్‌ యజమానులను హెచ్చరించారు. శుక్రవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో వాలర్‌ ప్లాంట్స్‌ ఇంజనీరింగ్‌ కార్యదర్శులు ఆహార భద్రత సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మినరల్‌ వాటర్‌ ప్లాంట్స్‌ నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. అధిక ధరలకు విక్రయించినా, ప్లాంట్ల పరిసరాల్లో పరిశుభ్రత పాటించకపోతే చర్యలు తప్పవన్నారు. ప్రతినెల తప్పనిసరిగా ఆర్‌వో ప్లాంట్స్‌ యజమానులు ప్రభుత్వ ల్యాబొరేటరీలో నీటి పరీక్షలు నిర్వహించి రిపోర్టు తీసుకోవాలని సూచించారు. రేపటి నుంచి పట్టణంలోని అన్ని ఆర్‌వో ప్లాంట్లలో నీటి శాంపిల్స్‌ సేకరించి తిరుపతిలోని ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ డీఈ సుధాకర్‌ నాయక్‌, ఏఈ కృష్ణారెడ్డి, మున్సిపల్‌ రెవెన్యూ ఇనస్పెక్టర్‌ మల్లికార్జున, ఆహార భద్రతా సిబ్బంది సీతారామయ్య, అన్ని వార్డుల ఇంజనీరింగ్‌ కార్యదర్శులు, ఆర్‌వో ప్లాంట్స్‌ నిర్వాహకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 11:23 PM