Share News

రూ.22.46 కోట్ల స్త్రీ నిధి రుణాల పంపిణీకి చర్యలు

ABN , Publish Date - Jul 22 , 2024 | 11:57 PM

ప్రస్తుత ఆర్థిక సం వత్సరంలో తంబళ్లపల్లె, పెద్దమండ్యం, ములకలచెరువు, పీటీయం, బి.కొత్తకోట మండలాలకు రూ.22.46 కోట్ల రుణాలు పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసినట్లు స్త్రీ నిధి మేనేజరు అమరావతి పేర్కొన్నారు.

రూ.22.46 కోట్ల స్త్రీ నిధి రుణాల పంపిణీకి చర్యలు
స్త్రీ నిధి రుణాలపై సూచనలిస్తున్న మేనేజరు అమరావతి

తంబళ్లపల్లె, జూలై 22:ప్రస్తుత ఆర్థిక సం వత్సరంలో తంబళ్లపల్లె, పెద్దమండ్యం, ములకలచెరువు, పీటీయం, బి.కొత్తకోట మండలాలకు రూ.22.46 కోట్ల రుణాలు పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసినట్లు స్త్రీ నిధి మేనేజరు అమరావతి పేర్కొన్నారు. సోమవారం స్థానిక వెలుగు కార్యాలయం లో ఏపీఎం గంగాధర్‌తో కలసి డ్వాక్రా మ హిళా సభ్యులతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నిధులలో తంబళ్లపల్లె మండలానికి రూ.4.52 కోట్లు, కొత్తకోటకు రూ.3.50 కోట్లు, ములకలచెరువుకు రూ.5.54 కోట్లు, పెద్దమం డ్యంకు రూ.3.94 కోట్లు, పెద్దతిప్పసముద్రం మండలానికి రూ.4.96 కోట్లు పంపిణీ చేసేం దుకు లక్ష్యంకాగా ఇప్పటికే ములకలచెరువు మండలానికి రూ.2.81 కోట్లు, పెద్దమండ్యం మండలానికి రూ.1.11 కోట్లు, తంబళ్లపల్లె మండలానికి రూ.60లక్షలు రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. అయితే గతంలో తీసుకున్న స్త్రీ నిధి రుణాలు పీటీయం మండలంలో రూ.32.36లక్షలు, తంబళ్లపల్లెలో రూ.11.11లక్షలు, పెద్దమండ్యంలో రూ.1.61లక్షలు, బి.కొత్త కోటలో ఒక లక్ష రుపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. మహిళా సభ్యులు గతంలో పొందిన స్త్రీ నిధి రుణాలను సకాలంలో చెల్లిస్తే ఇంకా ఎక్కువ మందికి రుణాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు రామలక్ష్మీ, సీసీలు భధ్రయ్య, ఆదిలక్ష్మీ, అంశీరాబేగం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2024 | 11:57 PM