రైతుల మాటున దళారీల దందా..!
ABN , Publish Date - Jan 29 , 2024 | 11:08 PM
సమాజంలో కష్టపడ్డ వాడు బాగుపడతాడో లేదో కానీ దళారీ మాత్రం రెండు చేతుల్లా ఆర్జిస్తున్నాడు. ఏ విషయంలో అయినా సరే.. దళారీ వ్యవస్థ ప్రధమ స్థానంలో నిలిచి సమాజంలో అన్ని రంగాల్లో వేళ్లూనుకుని పోయింది. అలాంటి దళారీ వ్యవస్థ రైతులు పండించే కూరగాయలపైన కూడా పడింది.
రాత్రి 7 నుంచే నాలుగురోడ్ల కూడలిలో ట్రాఫిక్ జామ్ ఫ రైతుల నుంచి కొనుగోలు
ఫ ఆపై దళారీల వ్యాపారం ఫ ఇదీ బదే ్వలు కూరగాయల మార్కెట్ దుస్థితి
బద్వేలు రూరల్, జనవరి 29 : సమాజంలో కష్టపడ్డ వాడు బాగుపడతాడో లేదో కానీ దళారీ మాత్రం రెండు చేతుల్లా ఆర్జిస్తున్నాడు. ఏ విషయంలో అయినా సరే.. దళారీ వ్యవస్థ ప్రధమ స్థానంలో నిలిచి సమాజంలో అన్ని రంగాల్లో వేళ్లూనుకుని పోయింది. అలాంటి దళారీ వ్యవస్థ రైతులు పండించే కూరగాయలపైన కూడా పడింది. కూరగాయలను మార్కెట్‌కు తెచ్చే రైతుల నుంచి కొనుగోలు చేసి కూరగాయల మార్కెట్ బయటే దళారీలు వ్యాపారం చేయడంతో నాలుగురోడ్ల కూడలి నుంచి పోరుమామిళ్ల రోడ్డులోని జిల్లా పరిషత్ హైస్కూలు వరకు నిత్యం రాత్రి 7గంటల నుంచి 10గంటల వరకు ట్రాఫిక్ సమస్య ఏర్పడి ఆ దారిన ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రైతుల నుంచి దళారీల కొనుగోలు..: బద్వేలు చుట్టూ రైతులు తాము పండించిన కూరగాయలను విక్రయించేందుకు పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్దకు వసా ్తరు. గతంలో మార్కెట్‌లోని దుకాణదారులకు విక్రయించడం లేదంటే ఇతరులకు విక్రయించేవారు. ప్రస్తుతం రాత్రి 7గంటలకు రైతులు కూరగాయల మార్కెట్ వద్దకు రాగానే అరగంట లోపు దళారీలు రైతుల వద్ద నుంచి కూరగాయలు కొనుగోలు చేసి తమ వెంట తెచ్చుకున్న ఎలకా్ట్రనిక్ కాటాల ద్వారా విక్రయాలు కొనసాగిస్తున్నారు. దీంతో రైతులనుకుని కూరగాయలు కొనేందుకు వచ్చే ప్రజలతో పూర్తిగా ట్రాఫిక్ స్తంభించి రాత్రి 7 తరువాత ఆ దారిన వెళ్లాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రైతులు ఏ సమయంలో క్రయ విక్రయాలు కొనసాగించాలి..:రైతులు తాము పండించిన కూరగాయలను మార్కెట్‌కు తీసుకువచ్చి రాత్రి 12 నుంచి తెల్లవారే లోపు దుకాణదారులు, లేదంటే ఇతరులకు విక్రయించి గతంలో వెళ్లిపోతుండేవారు. అయితే రాను రాను సమయం మారి రాత్రి 7గంటలకే మార్కెట్‌కు రావడంతో ఈ సమయాన్ని దళారీలు వినియోగించుకుని రైతుల వద్ద నుంచి తక్కువ ధరలకు కాయగూరలు కొని విక్రయాలు సాగిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.
రైతు బజారు లేకపోవడమే సమస్య..: బద్వేలు పట్టణం చుట్టూ గ్రామీణ ప్రాంతాల్లో కాయగూరలు పండించే రైతులు ఉన్నారు. అయితే వారు తాము పండించిన కూరగాయలను హోల్‌సేల్‌గా కానీ, రిటైల్‌గా కానీ అమ్ముకునేందుకు వారికి ఒక స్థానమంటూ ఇంత వరకు అధికారులు కానీ, పాలకులు కానీ ఏర్పాటు చేయలే క పోయారు. రైతు బజారు కనుక ఏర్పాటు చేసి ఉంటే రైతులు అమ్ముకునేందుకు వీలుంటుంది. తద్వారా కాస్త ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా రైతులు దళారీల చేతుల్లో మోసపోకుండా రైతు బజారు ఏర్పాటు చేస్తే మంచిదని పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు. రైతులు పండించిన పంటలు తాజాగా ఉండి, ధర తక్కువకు లభిస్తాయి కాబట్టి రైతు బజారు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పలువురు పేర్కొంటున్నారు.