Share News

వైభవంగా గంగరాళ్ల అభిషేకం

ABN , Publish Date - May 23 , 2024 | 11:52 PM

వాల్మీకిపురం పట్టణంలోని రైల్వేస్టేషన సమీపాన వెలసిన నల్లవీర గంగాభవానీ అమ్మవారి జాతర మహోత్సవాలలో భాగంగా గురువారం గంగరాళ్లకు జలాభిషేకా లు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

వైభవంగా గంగరాళ్ల అభిషేకం
రేణుకా పరంజ్యోతికి జ్యోతులు తీసుకొచ్చిన భక్తులు గంగరాళ్లకు పూజలు నిర్వహిస్తున్న మహిళలు

వాల్మీకిపురం, మే 23: వాల్మీకిపురం పట్టణంలోని రైల్వేస్టేషన సమీపాన వెలసిన నల్లవీర గంగాభవానీ అమ్మవారి జాతర మహోత్సవాలలో భాగంగా గురువారం గంగరాళ్లకు జలాభిషేకా లు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయాత్పూర్వం నుం చి ఆలయంలో అమ్మవారికి అభిషేకం, అర్చన, తోమాల సేవలతో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం జలకళశాలతో మహిళలు ఊరేగింపుగా వెళ్లి పట్టణంలోని బజారువీధి, నాయక్‌ వీధులలో గల గంగరాళ్లకు జలాభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా సాంస్కృతిక కార్యక్ర మాలు అలరించాయి. కార్యక్రమాలలో ఆలయ ధర్మకర్తలు రమణారెడ్డి, రామ్‌కుమార్‌రెడ్డి, కమిటీ సభ్యులు సత్యనారాయ ణశెట్టి, బలరామ్‌, అర్చకులు జనాస్వామి, సభ్యులు విజయ్‌కు మార్‌, మురళి, విజయ్‌కుమార్‌ వర్మ, భక్తులు పాల్గొన్నారు.

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ

వాల్మీకిపురం పట్టణంలోని నల్లవీరగంగాభవాని అమ్మవారి జాత ర సందర్భంగా పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు సురేష్‌, అరుణకుమారి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలను సమ ర్పించారు. గురువారం ఆలయ కమిటీ సభ్యుల చేతుల మీదుగా పట్టు వస్త్రాలు అందజేసి ఆలయంలో పూజలు నిర్వహించారు.

గ్రామ దేవతల జాతర ఉత్సవాలు

పెద్దమండ్యం, మే 23: మండలంలో గ్రామ దేవత ల జాతర ఉత్సవాలు వైభ వంగా జరిగాయి. మండ లంలోని రెక్కలకొండపల్లె లో వెలసిన రెక్కలకొండప ల్లె గ్రామ దేవత మల్లాల మ్మ తిరుణాల గురువారం రాత్రి వైభవంగా జరిగింది. అలాగే మండలంలోని సిద్దవరం, కానేకుంట్లపల్లె, చదివేవాండ్లపల్లె గ్రామ దేవతల జాతర్లు జరిగాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పండుగ సందడి నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బీరంగిలో రేణుకా పరంజ్యోతి జాతర

బి.కొత్తకోట, మే23: బి.కొత్తకోట మండల పరిధిలోని బీరంగి గ్రా మం లో వెలసిన రేణుకా పరంజ్యోతి అమ్మవారి జాతర మహో త్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యా యి. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలలో మొదటి రోజు బీరంగి గ్రామవాసులు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో జ్యోతులు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. జాతర వేడుకలలో భాగంగా అమ్మవారిని సుందరంగా పుష్పాలతో అలంకరించారు. మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో రేణుకా పరంజ్యో తి అమ్మవారి తిరుణాల నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

Updated Date - May 23 , 2024 | 11:52 PM