Share News

తృటిలో తప్పిన ప్రమాదం

ABN , Publish Date - May 19 , 2024 | 11:58 PM

బి. కొత్త కోట మండల పరిధిలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్‌ లీహిల్స్‌ ఘాట్‌ రోడ్డులో ఆదివారం పెను ప్రమా దం తప్పింది.

తృటిలో తప్పిన ప్రమాదం
హార్సిలీహిల్స్‌లో బ్రేక్‌ ఫెయిల్‌ అయిన బస్సు

బి.కొత్తకోట,మే19:బి. కొత్త కోట మండల పరిధిలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్‌ లీహిల్స్‌ ఘాట్‌ రోడ్డులో ఆదివారం పెను ప్రమా దం తప్పింది. అన్నమ య్య జిల్లా చిన్నమండ్యం కు చెందిన 40 మంది పర్యాటకుల బృంధం ఆదివారం విహార యాత్రలో భాగంగా హార్సిలీహిల్స్‌కు ఓ బస్సులో వచ్చారు. పర్యాటక ప్రదేశాలు అన్నీ తిరిగి సాయంత్రం తిరుగు ప్రయా ణంలో బస్సు ఘాట్‌రోడ్డు మూ డో మలుపు వద్దకు రాగానే బ్రేక్‌ ఫెయిల్‌ అయ్యి అదుపుతప్పింది. దీంతో బస్సు డ్రైవర్‌ చాకచక్యం గా వ్యవహరించి బస్సును లోయ లోనికి పోనియ్యకుండా ఓ బండరాయికి ఢీకొట్టాడు. ప్రయాణి కులంతా ఏమి జరుగుతోందో తెలియక హాహాకారాలు పెట్టారు. ప్రమాదం నుంచి బయటపడ్డా మని తెలుసుకుని ఉపశమనం పొందారు. ప్రమాదం జరగక పోవడంతో ప్రయాణికులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - May 19 , 2024 | 11:58 PM