ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ఉద్యమం
ABN , Publish Date - Jul 05 , 2024 | 10:09 PM
ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ కోసం ఉద్యమిద్దామని రెవ ల్యూషనరీ విద్యార్థి సంఘం (ఆర్‌ఎస్‌యూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రశాంత పిలుపు నిచ్చారు.

రాయచోటిటౌన, జూలై 5: ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ కోసం ఉద్యమిద్దామని రెవ ల్యూషనరీ విద్యార్థి సంఘం (ఆర్‌ఎస్‌యూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రశాంత పిలుపు నిచ్చారు. శుక్రవారం చెన్నముక్కపల్లె జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో ఆర్‌ఎస్‌యూ 10వ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా ని ర్వహించారు. ఆర్‌ఎస్‌యూ జిల్లా కార్యదర్శి శివారెడ్డి ఆధ్వర్యం లో జెండా ఆవిష్కరించి విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి వి జేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రశాంత మాట్లాడుతూ 2014 జూలై 5న ఆవిర్భవించిన ఆర్‌ఎస్‌యూ పదేళ్లు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగుపెడు తున్న సందర్భంగా రాయచోటిలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ విద్యా పరిరక్షణకు ఉద్యమాలే శరణ్య మన్నారు. ప్రభుత్వ విద్య పరి రక్షణతో పాటు నిబంధనలకు వ్యతిరేకం గా నడుస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసం స్థపై పలు పోరాటాలకు ఆర్‌ఎస్‌యూ నా యకత్వం వహించిందన్నారు. దేశంలోని కరువు ప్రాంతాల్లో ఉన్న పేద, మధ్య తర గతి విద్యార్థులకు కులాలతో సంబంధం లేకుండా, అన్ని రకాల సౌకర్యాలతో ప్రాథమి క స్థాయి నుంచి విద్య అందించాలనే లక్ష్యంతో ఆర్ ఎస్‌యూ రాజీలేని పోరాటాలు చేస్తోందన్నారు. కానీ ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు కోట్లు దోచిపెడుతున్నాయని, ఇది దుర్మార్గమైన కుట్ర అన్నారు. భవిష్యత్తులో దేశవ్యాప్త విధానంగా సమస్యల పరిష్కారానికి ఆర్‌ఎస్‌యూ నాయకత్వం వహిస్తుందని, అందుకు అనుగుణంగా సంస్థను బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రవీంద్రారెడ్డి, ఉపాఽ ద్యాయులు, ఆర్‌ఎస్‌యూ నాయకులు వెంకటేశ్వర్లు, శివమహేశ, వెంకట్రమణ, నవీన, బాబు తదితరులు పాల్గొన్నారు.