Share News

బాలుడిపై పిచ్చి కుక్క వీరంగం...! తలపై తీవ్ర రక్తగాయాలు

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:55 PM

:పిచ్చికుక్క వీరంగం సృష్టించడంతో రిహాన(4) అనే బాలుడి తలకు తీవ్ర రక్తగాయా లైన సంఘటన ఆలస్యంగా వెలుగుచూ సింది.

బాలుడిపై పిచ్చి కుక్క వీరంగం...!  తలపై తీవ్ర రక్తగాయాలు

గుర్రంకొండ, జనవరి 12:పిచ్చికుక్క వీరంగం సృష్టించడంతో రిహాన(4) అనే బాలుడి తలకు తీవ్ర రక్తగాయా లైన సంఘటన ఆలస్యంగా వెలుగుచూ సింది. స్థానికుల కథనం మేరకు గుర్రం కొండ పట్టణంలోని తాళంవీధికి చెం దిన రౌనక్‌ కుమారుడు రిహాన ఇంటి ముందర ఆడుకొంటుండగా పిచ్చికుక్క రెండు రోజుల క్రితం దాడి చేసింది. ఈ క్రమంలో బాలుడి తలపై ఇష్టానుసారం గా కరించింది. దీంతో కుటుంబ సభ్యులు బాలుడ్ని మెరుగైన వైద్యం కోసం తిరు పతిలోని స్విమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం రిహాన పరిస్థితి ఆందోళనకరంగా ఉంద ని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా 20 రోజుల క్రితం గ్రామంలో వీధి కుక్కల దాడిలో సుమారు 10 మందికిపైగా గాయపడ్డారు. ఈ సంఘటన మరువక ముందే బాలునిపై పిచ్చికుక్క దాడి చేయ డంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందిం చి తగు చర్యలు తీసుకో వాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:55 PM