Share News

టీడీపీలో చేరికల వరద

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:05 PM

మండలంలోని మంగంపేట బలిజపల్లిలో గురువారం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి ముక్కా రూపానందరెడ్డి, టీడీపీ జనసేన అభ్యర్ధి అరవ శ్రీధర్‌ సమక్షంలో, బీజేపీ నేతలు గల్లా శ్రీనివాసులు, పులపత్తూరు రామసుబ్బారెడ్డి, టీడీపీ నేతలు అనుమలగుండం చంద్రమోహన, కల్లాచలపతి, మాజీ వైస్‌ ఎంపీపీ గునిపాటి రాయుడు, గునిపాటి కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో అరిగెల గోవిందు, కొటారు మణి, రమణ, తిరుమలశెట్టి శీను, గునిపాటి శివతోపాటు 150 మంది టీడీపీలో చేరగా, మంగారపు నరసింహులు, నారదాసు కిష్టయ్య, కందుకూరి మణితోపాటు 50 మంది జనసేనలో చేరారు.

టీడీపీలో చేరికల వరద
టీడీపీలో చేరుతున్న ఎంఎల్‌ నారాయణ, నరసయ్య

ఓబులవారిపల్లె, ఏప్రిల్‌ 18 : మండలంలోని మంగంపేట బలిజపల్లిలో గురువారం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి ముక్కా రూపానందరెడ్డి, టీడీపీ జనసేన అభ్యర్ధి అరవ శ్రీధర్‌ సమక్షంలో, బీజేపీ నేతలు గల్లా శ్రీనివాసులు, పులపత్తూరు రామసుబ్బారెడ్డి, టీడీపీ నేతలు అనుమలగుండం చంద్రమోహన, కల్లాచలపతి, మాజీ వైస్‌ ఎంపీపీ గునిపాటి రాయుడు, గునిపాటి కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో అరిగెల గోవిందు, కొటారు మణి, రమణ, తిరుమలశెట్టి శీను, గునిపాటి శివతోపాటు 150 మంది టీడీపీలో చేరగా, మంగారపు నరసింహులు, నారదాసు కిష్టయ్య, కందుకూరి మణితోపాటు 50 మంది జనసేనలో చేరారు. ఈ సందర్భంగా జనసేన అభ్యర్ధి అరవ శ్రీధర్‌ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల జనసేన సైనికుల శ్రమకు త్వరలో ఫలితం రాబోతోందని, రైల్వేకోడూరులో మన తడాఖా ఏమిటో వైసీపీకి చూపించాలని కోరారు. బీజేపీ నేతలు పులపత్తూరు రామసుబ్బారెడ్డి, గల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అభ్యర్ధి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించి మన పారిశ్రామిక సమస్యలకు పరి ష్కారం కోరుదామని తెలిపారు. వాసుదేవరెడ్డి, అడపాల బాలాజీ, మంగం పేట యూత నాయకులు అనుమలగుండం హరికృష్ణ, బీజేపీ నాయకులు రామసుబ్బా రెడ్డి, గోవర్ధనరెడ్డి, జై భారతరెడ్డి, జనసేన నాయకులు ముత్యాల కిషోర్‌ తదితరులు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజంపేట: మండలంలోని ఊటుకూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ ఎంఎల్‌ నారాయణ, నర్సయ్య గురువారం రాజంపేట నియోజకవర్గ టీడీపీ అఽభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజంపేట మండల మాజీ ఉపాధ్యక్షుడు నాగా సుధాకర్‌ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి హరిప్రసాద్‌, మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు కొండయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 11:05 PM