Share News

ఉండవల్లికి నేతల వెల్లువ

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:21 PM

రాష్ట్రంలో టీడీపీ ఘన విజ యం సాధించిన తర్వాత గెలుపొందిన ప్రజాప్రతి నిధులు ఉంవల్లికి క్యూ కట్టారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే నంద్యాల వరద రాజులరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌యాదవ్‌, ప్రొద్దుటూరు, బద్వేలు నేతలు ఉండవల్లిలోని నివా సంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ను కలిసి అభినం దించారు.

ఉండవల్లికి నేతల వెల్లువ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసిన ప్రొద్దుటూరు మైదుకూరు ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి - పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌ యాదవ్‌

నారా చంద్రబాబు నాయుడు, లోకేష్‌ను కలిసిన కొత్త ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌, జిల్లా టీడీపీ నేతలు

ప్రొద్దుటూరు, జూన్‌ 6: రాష్ట్రంలో టీడీపీ ఘన విజ యం సాధించిన తర్వాత గెలుపొందిన ప్రజాప్రతి నిధులు ఉంవల్లికి క్యూ కట్టారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే నంద్యాల వరద రాజులరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌యాదవ్‌, ప్రొద్దుటూరు, బద్వేలు నేతలు ఉండవల్లిలోని నివా సంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ను కలిసి అభినం దించారు. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సాధించిన గెలుపుపై వరదరాజుల రెడ్డి లోకేష్‌తో ఆనందాన్ని పంచుకున్నారు. త్వరలో ప్రభుత్వ ఏ ర్పాటు, ప్రొద్దుటూరు తాజా రాజకీయాలపై చాంద్ర బాబుతో వరదరాజులరెడ్డితో చర్చించారు. వరదరా జుల రెడ్డితో ఆయన మనుమడు టీడీపీ యువనేత మెట్టుపల్లి అమల్‌ రెడ్డి రవిరెడ్డి లోకేష్‌ను కలిశారు.

లోకేష్‌ను కలిసిన కొండారెడ్డి

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి కలిశారు. నియోజకవర్గంలో తాజా రాజకీయాలపై లోకేష్‌కు తెలిపారు. టీడీపీ ఘన విజయం, త్వరలో ఏర్పాటు కానున్న ప్రభుత్వం ఏర్పాటుతో కార్యకర్తల ఆనం దానికి అవధుల్లేవని తెలిపారు.

నందం సుబ్బయ్య హత్యకేసును సీఐడీతో పున: విచారణ జరిపించాలి

ప్రొద్దుటూరు బీసీ నేత నందం సుబ్బయ్య హత్య కేసును సీఐడీతో పునః విచారణ చేపట్టాలని టీడీ పీ నేత జీవీ ప్రవీణ్‌ రెడ్డి నారా లోకేష్‌ను కోరారు. నారా లోకేష్‌ స్వగృహంలో ప్రవీణ్‌రెడ్డి కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఆయ న బావమరిది బంగారురెడ్డి సాగించిన ఇసుక భూదందాలపై ప్రశ్నించినందుకు నందం సుబ్బ య్యను అతికిరాతకంగా నరికి చంపిన హంతకుల ను చట్టం ముందు నిలబెట్టి శిక్షించాలని కోరారు.

లోకేష్‌ను కలిసిన మహేశ్వరరెడ్డి

టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్‌ బాబును మాజీ జడ్పీటీసీ సభ్యుడు తోట మహేశ్వర రెడ్డి గురువారం ఆయన స్వగృహంలో కలిశారు. ఈసం దర్భంగా టీడీపీ ఘన విజయం సాధించినందుకు లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు, లోకేష్‌ను కలిసిన పుట్టా, తనయులు

మైదుకూరు, జూన్‌ 6: టీడీపీ అధినేత చంద్ర బాబు, యువనేత లోకేష్‌ను మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ యాదవ్‌ గురువారం ఉండవల్లి లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలి శారు. చట్ట సభలకు ఎన్నికైన తండ్రీ కొడుకులు భవిష్యత్‌ ప్రణాళికపై మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణను సైతం కలిశారు. వీరితో పాటు పుట్టా చిన్న కుమారుడు రవికుమార్‌ యాదవ్‌, టీడీపీ నేతలు రామచంద్రనాయుడు, ఏపీ రవీంద్ర తదితరులున్నారు.

శుభాకాంక్షలు తెలిపిన రితేష్‌

బద్వేలుటౌన్‌, జూన్‌ 6: సార్వత్రిక ఎన్నికల్లో అఖం డ విజయం సాధించి, చరిత్ర సృష్టించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు, మంగళగిరిలో అత్యధి క మెజార్టీతో గెలుపొందిన నారాలోకేష్‌ను బద్వేలు నియోజకవర్గ సమన్వయకర్త రితేష్‌కుమార్‌రెడ్డి కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jun 06 , 2024 | 11:21 PM