Share News

7 ట్రాక్టర్లు, ఎక్సకవేటర్‌ సీజ్‌

ABN , Publish Date - Nov 25 , 2024 | 11:35 PM

మున్సిపాలిటీ పరిధిలోని బయనపల్లె చెరువులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న 7 ట్రాక్టర్లను, ఒక ఎక్సవేటర్‌ను తహసీల్దార్‌ ఉదయభాస్కరరాజు సీజ్‌ చేశారు.

7 ట్రాక్టర్లు, ఎక్సకవేటర్‌ సీజ్‌
తహసీల్దారు కార్యాలయంలో సీజ్‌చేసిన ట్రాక్టర్లు, ఎక్సకవేటర్‌

బద్వేలుటౌన్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ పరిధిలోని బయనపల్లె చెరువులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న 7 ట్రాక్టర్లను, ఒక ఎక్సవేటర్‌ను తహసీల్దార్‌ ఉదయభాస్కరరాజు సీజ్‌ చేశారు. గత కొద్ది రోజులుగా మట్టిమాఫియా రెచ్చిపోయి చెరువులో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తవ్వి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో సోమవారం తహసీల్దార్‌ తన సిబ్బందితో బయనపల్లె చెరువును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించే సమయంలో ఒక ఎక్సవేటర్‌ను, 7 ట్రాక్టర్లను సీజ్‌ చేసినట్లు ఆయన తెలిపారు. ఎవరైనా అక్రమంగా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Updated Date - Nov 25 , 2024 | 11:35 PM