Share News

అంగన్వాడీ ఇంటర్వ్యూలకు 58 మంది హాజరు

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:48 PM

మదనపల్లె రెవెన్యూ డివిజనలోని నాలుగు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా వున్న అంగ న్వాడీ పోస్టులకు నిర్వహించిన ఇంటర్వ్యూ లకు 58 మంది హాజరయ్యారు.

అంగన్వాడీ ఇంటర్వ్యూలకు 58 మంది హాజరు
సబ్‌కలెక్టరేట్‌లో అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న ఆర్డీవో

మదనపల్లె టౌన, జనవరి 5: మదనపల్లె రెవెన్యూ డివిజనలోని నాలుగు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా వున్న అంగ న్వాడీ పోస్టులకు నిర్వహించిన ఇంటర్వ్యూ లకు 58 మంది హాజరయ్యారు. శుక్రవారం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో ఆర్డీవో మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 10 అంగన్వాడీ కార్యకర్తలు, 23 అంగన్వాడీ హెల్పర్లు, ఇద్దరు మినీ అంగన్వాడీ వర్కర్‌ పోస్టులకు అభ్యర్థులను ఇంటర్వ్యూ నిర్వహిం చారు. అంగన్వాడీ సెంటర్లలో లబ్ధిదారులకు అందుతున్న సేవలు, సంక్షేమపథకాలు, తదితర అంశాలపై ఆర్డీవో మురళి, ఐసీడీఎస్‌ ఇనచార్జి పీడీ శశికళ ప్రశ్నలు అడిగారు. ఈ కార్యక్రమంలో ఇంటర్వ్యూ కమిటీ సభ్యులు డిప్యూటీ డీఎంహెచవో డాక్టర్‌ లక్ష్మి, మద నపల్లె, బి.కొత్తకోట, తంబళ్లపల్లె, వాల్మీకిపురం ప్రాజెక్టుల సీడీపీవోలు సుజాత, భాగ్యమ్మ, నాగవేణి, భారతి, అంగన్వాడీ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 11:48 PM