స్థానిక ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలి
ABN , Publish Date - Aug 24 , 2024 | 11:02 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఇడగొట్టు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
రాయచోటిటౌన, ఆగస్టు 24: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఇడగొట్టు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని బీసీ భవనలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలన్నారు. పేద పిల్లల ఉద్యోగ స్కిల్ డెవలప్‌మెంట్ కోసం రాజంపేట, మదనపల్లె,రాయచోటి ప్రాంతాల వారికి అందుబాటులో ఉండే విధంగా స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. దేశంలో దాదాపు 3,743 కులాల వెనుకబడి ఉన్నాయని మండల్ కమిషన గుర్తించిందన్నారు. అందులో 63.4 శాతం హిందూ కులాలు, 8.3 శాతం ముస్లిం మైనార్టీలు ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు నరసింహాచారి, జిల్లా మహిళా అధ్యక్షురాలు వల్లెపురమణమ్మ, కార్యదర్శి ఇమాముల్లా, గౌరవాధ్యక్షుడు నాగార్జునాచారి, వెంకట్రమణ, తిప్పయ్య, ట్రెజరర్ సుధాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వరయ్య, యువజన సంఘం అధ్యక్షుడు పాలగిరి హబీబుల్లా, కార్యదర్శి వెంకటేశ, రాయచోటి తాలూకా కార్యవర్గ సభ్యుడు, రాయచోటి తాలూకా ప్రెసిడెంట్ సంచుల ఖాదర్‌బాషా, రమేశ, శెట్టిపల్లి రెడ్డెయ్య,జిల్లా కార్యవర్గ సభ్యులు పీ. రెడ్డెయ్య, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.