Share News

30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలి

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:28 PM

ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీ జేఏసీ ప్రొ ద్దుటూరు తాలూకా చైర్మన కేజే రఘురామిరెడ్డి డిమాండ్‌ చేశా రు.

30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలి
: నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు

ప్రొద్దుటూరు టౌన, ఫిబ్రవరి 15 : ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీ జేఏసీ ప్రొ ద్దుటూరు తాలూకా చైర్మన కేజే రఘురామిరెడ్డి డిమాండ్‌ చేశా రు. సమస్యలను పరిష్కరించా లని గురువారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023లో బకాయి ఉన్న రెండు డీఏలతోపాటు, సీపీఎస్‌ వారికి డీఏ, అరియర్స్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సరెండర్‌ లీవ్‌ బకాయిలు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు మంజూరు చేయాలని, సీపీఎస్‌, జీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన విధానం అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్‌ రామసుబ్బయ్య, పెన్షనర్స్‌ అసోసియేషన నాయకులు లక్షమయ్య, రెడ్డన్న, దస్తగిరి రెడ్డి, లక్ష్మిరెడ్డి, ఎన్జీఓ అసోసియేషన సభ్యులు సుజాత, ప్రమీల, జయంతి కుమారి, సుబ్బారెడ్డి, శివరామానుజం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 11:28 PM