నాలుగు రోజుల్లో 2996 పోస్టల్‌బ్యాలెట్ ఓట్లు
ABN , Publish Date - May 10 , 2024 | 12:15 AM
మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గానికి సంబం ధించి నాలుగు రోజులుగా నిర్వహిం చిన పోలింగ్‌లో 3,050 పోస్టల్ బ్యా లెట్ ఓట్లకు గాను 2,996 ఓట్లు పోలయ్యాయి.
మదనపల్లె టౌన, మే 9: మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గానికి సంబం ధించి నాలుగు రోజులుగా నిర్వహిం చిన పోలింగ్‌లో 3,050 పోస్టల్ బ్యా లెట్ ఓట్లకు గాను 2,996 ఓట్లు పోలయ్యాయి. తొలి రెండు రోజులు స్థానిక బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశా లలోని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించగా, మిగిలిన రెండు రోజులు సబ్‌కలెక్టరేట్‌లో నిర్వహించారు. తొలి రోజున 1906 ఓట్లు, రెండో రోజు 701 ఓట్లు, మూడో రోజున, మూడో రోజున 188 ఓట్లు పోల్ కాగా చివరి రోజైన గురువారం 61 ఓట్లు మాత్రమే పోలయ్యా యి. కేవలం 54 మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోలేదు.
తంబళ్లపల్లెలో: పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ గురువారంతో ప్రశాం తంగా ముగిసింది. చివరి రోజైన గురువారం 18 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఏఆర్వో బ్రహ్మయ్య తెలిపారు. తంబళ్లపల్లె తహసీల్దారు కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన సెంటర్ ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 1659 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు కు దరఖాస్తు చేసుకోగా 1583 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొదటి రోజున 998 మంది, రెండో రోజున 498 మంది, మూడో రోజున 37 మంది, నాలుగవ రోజున 32 మంది, ఐదో రోజున 18 మంది మొత్తం 1583 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.