Share News

AP Elections: వందల కోట్లలో.. మాధవి ఆస్తులు.. !

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:46 PM

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగున్నాయి. అయితే వీటితోపాటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సైతం జరుగుతున్నాయి. ఆ క్రమంలో అభ్యర్థుల నామినేషన్ల పర్వం కొనసాగుంది. అయితే ఈ నామినేషన్ల వేళ.. అభ్యర్థులు తమ ఆస్తులకు సంబంధించిన ఆపిడవిట్ దాఖలు చేస్తున్నారు. దీంతో ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థలు ఆస్తుల వివరాలు బహిర్గతమవుతున్నాయి.

AP Elections: వందల కోట్లలో.. మాధవి ఆస్తులు.. !
Lokam Madhavi

విజయనగరం, ఏప్రిల్ 20: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగున్నాయి. అయితే వీటితోపాటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సైతం జరుగుతున్నాయి. ఆ క్రమంలో అభ్యర్థుల నామినేషన్ల పర్వం కొనసాగుంది. ఈ నామినేషన్ల వేళ.. అభ్యర్థులు తమ ఆస్తులకు సంబంధించిన ఆపిడవిట్ దాఖలు చేస్తున్నారు. దీంతో ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థలు ఆస్తుల వివరాలు బహిర్గతమవుతున్నాయి.

BRS: గులాబీ పార్టీలో గుబులు.. కారు దిగేందుకు మరో ఎమ్మెల్యే సిద్ధం..?

అలాంటి వేళ ఉమ్మడి విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ స్థానం నుంచి కూటమి అభ్యర్థి, జనసేన పార్టీ నాయకురాలు లోకం మాధవి ఎన్నికల బరిలో నిలిచారు. ఆమె ఆస్తులు రూ.894 కోట్లు ఉన్నట్లు తన అఫిడవిట్‌లో వెల్లడించారు.

మిరాకిల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ, విద్యా సంస్థలు, భూములు, నగదు, బ్యాంక్ డిపాజిట్లు రూపంలో సైతం ఆస్తులు ఉన్నట్లు.. ఆమె తన అపిడవిట్‌లో పేర్కొన్నారు. ఇక బ్యాంకులో రూ.4.41 కోట్లు, లిక్విడ్ క్యాష్‌గా తన వద్ద రూ. 1.15 లక్షలు ఉన్నట్లు తెలిపారు.


చరాస్తులు రూపంలో రూ.856.57 కోట్లు ఉండగా, స్థిరాస్తుల రూపంలో రూ.15.70 కోట్లు ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇక రూ.2.69 కోట్ల మేర అప్పు కూడా ఉందని తన అఫిడవిట్‌లో తెలిపారు. ఏప్రిల్ 19వ తేదీన రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నామినేషన్ ముగింపు రోజు నాటికి ఎన్నికల బరిలో నిలిచిన.. కోటీశ్వరుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Pawan Kalyan: నిరంతరం రాష్ట్రం గురించే చంద్రబాబు ఆలోచన

అలాగే అన్నీ పార్టీల్లో ఇటువంటి కోటీశ్వరులు ఉంటారు. అయితే సదరు అభ్యర్థుల ఆస్తులు ఎలా ఉన్నాయో.. అలాగే వారికి అప్పులు కూడా ఉండడం గమనార్హం. అందుకు కేంద్ర మంత్రులతోపాటు రాష్ట్ర మంత్రులు సైతం అందుకు మినహాయింపు కాదన్నది సుస్పష్టం.

ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం..

Updated Date - Apr 20 , 2024 | 01:59 PM