Share News

MLA Pinnelli: పిన్నెల్లి ఎలా తప్పించుకున్నారు?

ABN , Publish Date - May 23 , 2024 | 03:16 AM

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు పోలీసుల నుంచి ఎలా తప్పించుకోగలిగారు?

MLA Pinnelli: పిన్నెల్లి ఎలా తప్పించుకున్నారు?

  • పిన్నెల్లికి సీనియర్‌ ఐపీఎస్‌ సాయం!

  • తాడేపల్లికి ఆయన అత్యంత సన్నిహితుడు

అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) సోదరులు పోలీసుల నుంచి ఎలా తప్పించుకోగలిగారు? పిన్నెల్లి సోదరులు పోలీసులకు దొరకకుండా తాడేపల్లి ప్యాలెస్‌కు అత్యంత సన్నిహితుడైన ఓ సీనియర్‌ ఐపీఎస్‌ దర్శకత్వం వహించగా, మరో సీనియర్‌ ఐఏఎస్‌ సహకరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హింసాత్మక సంఘటనలు జరిగిన నేపథ్యంలో పోలీసులు పిన్నెల్లి సోదరులను హౌస్‌ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులకు తెలియకుండా ఇంట్లో నుంచి వారిద్దరూ తప్పించుకున్నారు. ఆ తర్వాత పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో బయటకు రావడంతో పిన్నెల్లిని అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో తన అరెస్టు అనివార్యమని భావించిన పిన్నెల్లి మరోసారి పోలీసు ల కళ్లు గప్పి తప్పించుకున్నారు. తెలంగాణలో వారిని అరెస్ట్‌ చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే పిన్నెల్లి సోదరుల జాడ తెలియరాలేదు. పోలీసుల కదలికలను పిన్నెల్లికి చేరవేస్తున్నది ఎవరు? ఈవీఎం ధ్వంసంతో పాటు ఎమ్మెల్యేపై మరో హత్యాయత్నం కేసు కూడా ఉన్న నేపథ్యంలో పారిపోయేందుకు సహకరించింది ఎవరు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

pinnelli.jpg

తాడేపల్లి పెద్దలతో నిరంతరం టచ్‌లో ఉండే సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఐపీఎస్‌ స్వీయ దర్శకత్వంలోనే పిన్నెల్లి తప్పించుకున్నట్టు ఉన్నత స్థాయి పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనికి మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సహకరించినట్లు చర్చ జరుగుతోంది. కీలక అధికారి పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు పిన్నెల్లికి చేరవేస్తూ.. ‘సేఫ్‌’గా తప్పించుకునే మార్గాలను సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జగన్‌ విదేశాలకు వెళ్లేరోజునే పిన్నెల్లి సోదరులు తాడేపల్లి ప్యాలె్‌సలో ఆయనను కలుసుకున్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన సంగతి తెలిపారు. ఆ విషయంలో ఎన్నికల కమిషన్‌ సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటే పిన్నెల్లి సోదరులకు సహకరించాలని సదరు కీలక అధికారిని జగన్‌ ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఆయన పోలీసుల కదలికలను పిన్నెల్లికి చేరవేస్తున్నట్లు తెలుస్తుంది.

Pinnelli-Look-Out-Notice.jpg

పరారీలోనూ పోలీసుల హస్తం!

పిన్నెల్లి సోదరులు హౌస్‌ అరె్‌స్టలో ఉన్నప్పుడు మాచర్ల పట్టణంలోని తమ స్వగృహం నుంచి పరారవడానికి స్థానిక పోలీసు అధికారుల హ స్తం ఉందనే ఆరోపణలున్నాయి. హోంగార్డు నుంచి కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ, ఎస్బీ అధికారులు సహకరించినట్లు సమాచారం. సిట్‌ బృందం మాచర్ల లో పర్యటించినపుడు పోలీసుల పనితీరులో లోపాలను గుర్తించింది. దీనిపై ఉన్నతాధికారులకు నివేదించింది. ఇదిలావుంటే, పిన్నెల్లి సోదరు లు విదేశాలకు పారిపోయే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికోసం ఒక ప్రముఖ టీవీ చానల్‌కు చెందినవారిని ఉపయోగించుకున్నట్లు సమాచారం. పిన్నెల్లి సోదరులు ఆంధ్ర సరిహద్దులు దాటే సమయంలో కూడా ఆ చానల్‌కు చెందిన ప్రముఖ వ్యక్తి వారితో ఉన్నట్లు తెలుస్తోంది.

mukesh-kumar-ceo.jpg

పిన్నెల్లికి ఏడేళ్లు శిక్ష పడే అవకాశం: సీఈవో

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశ ముందని సీఈవో ముఖేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. కోర్టు రెండేళ్ల పైబడి శిక్ష విధిస్తే.. ఆయనపై అనర్హత వేటు కూడా పడే అవకాశముందన్నారు. పాల్వాయి గేట్‌లో ఈవీఎంల ధ్వంసంపై ఐపీసీ, పీడీపీపీ, ఆర్పీ చట్టాల్లోని 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై ఈ నెల 20నే కేసు నమోదు చేసినట్లు తెలి పారు. సచివాలయంలో బుధవారం మీనా మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రం లో పోలింగ్‌ రోజున 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. మాచర్ల లోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశాం. ఇక్కడ ఏడు ఈవీఎంలు ధ్వంసమైనా.. కంట్రోల్‌ యూనిట్లలో డేటా భద్రం గానే ఉంది. రీపోలింగ్‌ అవసరం ఉండదు. పాల్వాయిగేట్‌లోని పో లింగ్‌ బూత్‌లో ఈవీఎంను గుర్తు తెలియని వ్యక్తి పగలగొట్టినట్టు మొదట కేసు నమోదు చేసినా.. తర్వాత ఫుటేజ్‌ ఆధారంగా ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసినట్లు గుర్తించాం. ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరుని ఏ1గా చేర్చి కేసు నమోదు చేశారు. పిన్నెల్లిని వెంటనే అరెస్ట్‌ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈవీఎంని ధ్వంసం చేసిన వారికి రెండేళ్ల నుంచి గరిష్ఠంగా ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది’ అని తెలిపారు. కౌంటింగ్‌ రోజు 20 కంపెనీల కేంద్ర బలగాలను రాష్ట్రానికి రప్పిస్తున్నామని వెల్లడించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఫ్యాన్‌ పార్టీకి సీఈసీ చెక్‌..

అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే పిన్నెల్లి..

అమిత్ సా వ్యాఖ్యాలపై కేజ్రీవాల్ ఆగ్రహం..

బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరంటే..

జగన్‌ సర్కార్‌ మరో కుట్ర

Read Latest AP News and Telugu News

Updated Date - May 23 , 2024 | 08:26 AM