Share News

మాచర్లలో ఉద్రిక్తత:విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

ABN , Publish Date - Mar 31 , 2024 | 08:30 PM

శ్రీగౌతమ్ స్కూల్ యాజమాన్యం మొద్దు నిద్ర వల్లే తమ బిడ్డలు మరణించారని తల్లిదండ్రులు ఆగ్రహించారు. ఆ క్రమంలో శ్రీగౌతమ్ స్కూల్‌ను ధ్వంసం చేశారు. అయితే వారిని అడ్డుకోబోయిన పోలీసులపైనే కాకుండా.. పోలీసుల వాహనంపై కూడా వారు దాడి చేసి.. ధ్వంసం చేశారు.

మాచర్లలో ఉద్రిక్తత:విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

మాచర్ల, మార్చి 31: శ్రీగౌతమ్ స్కూల్ యాజమాన్యం మొద్దు నిద్ర వల్లే తమ బిడ్డలు మరణించారని తల్లిదండ్రులు ఆగ్రహించారు. ఆ క్రమంలో శ్రీగౌతమ్ స్కూల్‌ను ధ్వంసం చేశారు. అయితే వారిని అడ్డుకోబోయిన పోలీసులపైనే కాకుండా.. పోలీసుల వాహనంపై కూడా వారు దాడి చేసి.. ధ్వంసం చేశారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దాంతో పరిస్థితి దాదాపుగా అదుపు తప్పింది.

ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు అదనపు పోలీసు బలగాలను రప్పిస్తున్నారు. పొలంలోని నీటి కుంటలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. దీంతో మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన మిన్నంటింది. ఆ క్రమంలో వారి ఆగ్రహం కట్టలు తెంచుకోంది. దీంతో స్కూల్ పై దాడి చేశారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్నీ ఏపీ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

pawankalyan: ‘భారీ మెజార్టీతో గెలవబోతున్నాం’

Chandrababu: జగన్ దుమ్ము దులిపిన చంద్రబాబు

Updated Date - Mar 31 , 2024 | 08:36 PM