Share News

AP News: అనపర్తిలో అసంతృప్తికి కారణం మీరే

ABN , Publish Date - Mar 28 , 2024 | 05:44 PM

అనపర్తిలో తెలుగుదేశం పార్టీ ఉనికిని ప్రమాదంలో పడేసింది మీరేనని.. ఇప్పుడు అక్కడ పార్టీని కాపాడుకోవాల్సింది కూడా మీరేంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎదుట ఆ నియోజకవర్గ ఇన్‌చార్జీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుండ బద్దలు కొట్టినట్లు తెలుస్తోంది.

AP News: అనపర్తిలో అసంతృప్తికి కారణం మీరే

అనపర్తి: అనపర్తిలో తెలుగుదేశం పార్టీ ఉనికిని ప్రమాదంలో పడేసింది మీరేనని.. ఇప్పుడు అక్కడ పార్టీని కాపాడుకోవాల్సింది కూడా మీరేంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎదుట ఆ నియోజకవర్గ ఇన్‌చార్జీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుండ బద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కుటమిగా ఏర్పడ్డాయి. ఆ క్రమంలో అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీకి కేటాయించారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శివరామకృష్ణం రాజు పేరును ఆ పార్టీ అగ్రనాయకత్వం ఇప్పటికే ప్రకటించింది.

దీంతో నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతోన్నాయి. అందులోభాగంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద ఈ రోజు ఉధయం టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పార్టీ శ్రేణులు పదవులు రాజీనామా చేసేందుకు సిద్దం కాగా.. ఒకరిద్దరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. దీంతో వారి ప్రయత్నాలను రామకృష్ణారెడ్డి నిలువరించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పార్టీ అధినేత చంద్రబాబుకు విన్నవిస్తాన్నారు. దాంతో చంద్రబాబుతో రామకృష్ణారెడ్డి పైవిధంగా మాట్లాడినట్లు తెలుస్తోంది.

మరోవైపు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి ఎయిర్ పోర్ట్‌‌కు చేరుకున్నారు. ఆ సమయంలో రామకృష్ణారెడ్డి ముఖ్య అనుచరులు ఆమెను కలిసి.. అనపర్తి ఎమ్మెల్యే టికెట్ తమ నేతకు వచ్చేలా చూడాలని కోరిగా.. తాను రాజకీయాల్లో జోక్యం చేసుకోనన్నారు. అయితే ఈ అంశాన్ని మాత్రం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తానని వారికి భువనేశ్వరి హామీ ఇచ్చినట్లు సమాచారం. అదీకాక.. ఈ ఎన్నికల్లో కూటమి ఏర్పడక ముందు అనపర్తి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది. కానీ కూటమి ఏర్పడిన తర్వాత సీట్ల సర్దుబాటులో భాగంగా అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో రామకృష్ణారెడ్డి అనుచరులు తీవ్ర ఆందోళనతో రగలిపోతున్నారు.

మరిన్నీ ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 28 , 2024 | 05:44 PM