AP High Court : రఘురామ ఇంప్లీడ్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి
ABN , Publish Date - Dec 31 , 2024 | 06:39 AM
గుంటూరు, నగరంపాలెం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ...

అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): గుంటూరు, నగరంపాలెం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెం ట్ ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్‌లో తనను ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినిపించేందుకు అనుమతించాలని కోరుతూ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. పిటిషన్‌పై విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది.