Share News

పల్నాడు జిల్లాలో అపహాస్యమైన ప్రజాస్వామ్యం

ABN , Publish Date - May 23 , 2024 | 12:53 AM

సార్వత్రిక ఎన్నికల సంద ర్భంగా పల్నాడు జిల్లాలో ప్రజా స్వామ్యం అపహాస్యమైందని టీడీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు వేములకొండ శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

పల్నాడు జిల్లాలో అపహాస్యమైన ప్రజాస్వామ్యం
అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వినతిపత్రం ఉంచుతున్న వేములకొండ, మ్యాని

గుంటూరు, మే 22(ఆంధ్ర జ్యోతి): సార్వత్రిక ఎన్నికల సంద ర్భంగా పల్నాడు జిల్లాలో ప్రజా స్వామ్యం అపహాస్యమైందని టీడీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు వేములకొండ శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల హింసను ఖండిస్తూ, అపహాస్యంపాలైన ప్రజాస్వామ్యా న్ని కాపాడమని కోరుతూ ఆయన ఆధ్వర్యంలో బీసీ నేతలు బుధవా రం లాడ్జి సెంటర్లోని అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించా రు. ఆయన మాట్లాడుతూ అరాచ కాలకు కేరాఫ్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని, ఈవీఎం ధ్వంసం చేయడం పిన్నెల్లి దుర్మార్గానికి పరాకాష్ట అని, వీడియో బయటకొచ్చేవరకు కేసు పెట్టకపోవడం పోలీసుల నిర్లక్ష్యమేనని ఆరోపించారు. అంత స్పష్టంగా పిన్నెల్లి పోలింగు బూతలో చొరబడి ఈవీఎం మెషిన బద్దలు గొడితే, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీ ఎం ధ్వంసం చేశారంటూ పోలీసులు కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉం దన్నారు. గతంలో స్థానిక ఎన్నికల్లో దౌర్జన్యాలు చేసి ఏవిధంగా ఏకపక్షం చేసు కున్నారో అదే విధంగా సార్వత్రిక ఎన్నికలను కూడా జరపాలని కుట్రపన్నారని ఆరోపించారు. దీనిలో భాగంగానే చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, రాజేంద్రనాధ్‌రెడ్డి లాంటి అధికారులను వైసీపీ నేతలు వాడుకున్నారన్నారు. టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మద్దిరాల ఇమ్మానుయేల్‌ మాట్లాడుతూ పల్నాడులో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసను ఎమ్మెల్యే పిన్నెల్లి ప్రోత్సహించాడని, మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం రెంటాలలో టీడీపీ ఏజెంట్లు, సానుభూ తిపరులపై కర్రలు, కొడవళ్లతో దాడికి దిగారని, టీడీపీ ఏజెంట్‌ మంజుల నుదిటి పై గొడ్డలితో నరికారు, మరో 50 మందిపైనా దాడి చేశారు. పోలింగ్‌ అనంతరం పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి కారంపూడిలో బీభత్సం సృష్టించాడన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాదాల చినకొండలరావు, గట్టి శ్రీనివాసరావు, సూరె శ్రీనివాసరావు, జంపని నాగేశ్వరరావు, పామర్తి మోహనరావు, కదిరి ఈశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2024 | 12:53 AM