Share News

కౌంటింగ్‌ ఏజెంట్లు ఎన్నికల నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:26 AM

ఎన్నికల కౌంటింగ్‌కు హాజరయ్యే రాజకీయ పార్టీలకు చెందిన కౌంటింగ్‌ ఏజెంట్లు ఎన్నికల కమిషన్‌ నియమ, నిబంధనలు తప్పని సరిగా పాటించాలని వేమూరు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి వసంతరాయుడు సూచించారు.

కౌంటింగ్‌ ఏజెంట్లు ఎన్నికల నిబంధనలు పాటించాలి

వేమూరు, జూన్‌ 1 : ఎన్నికల కౌంటింగ్‌కు హాజరయ్యే రాజకీయ పార్టీలకు చెందిన కౌంటింగ్‌ ఏజెంట్లు ఎన్నికల కమిషన్‌ నియమ, నిబంధనలు తప్పని సరిగా పాటించాలని వేమూరు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి వసంతరాయుడు సూచించారు. వేమూరు మండల పరిషత్‌ కార్యాలయం రోశయ్య మీటింగ్‌ హాల్లో కౌంటింగ్‌కు హాజరయ్యే రాజకీయ పార్టీల కౌంటింగ్‌ ఏజెంట్ల కు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్‌ ఏజెంట్లు ఉదయం 7 గంటల కల్లా కౌంటింగ్‌ హాలుకు హాజరవ్వాలని ఎనిమిది గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం అవుతుందని అన్నారు. సెల్‌ఫోన్‌ కౌంటింగ్‌ హాల్‌లోకి అనుమతించబడదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కౌంటింగ్‌ హాల్లో ప్రవర్తించాల్సిన విధానంపై పలు సూచనలు అందజేశారు. ఆయనతో పాటు డీఎస్పీ మురళీకృష్ణ, వేమూరు, చుండూరు సీఐలు రామకృష్ణ, శ్రీనివాసరావు, వేమూరు తహసీల్దార్‌ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2024 | 12:27 AM