Share News

కూటమి విజయం కోసం బారులు తీరిన ఓటర్లు

ABN , Publish Date - May 15 , 2024 | 12:24 AM

ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి ప్రజలు పట్టం కడుతు న్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్‌ అన్నారు. కూటమిని గెలిపించేందుకు ఓటర్లు బారులు తీరారని ఆయన అన్నారు.

కూటమి విజయం కోసం బారులు తీరిన ఓటర్లు

గుంటూరు సిటీ, మే 14 : ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి ప్రజలు పట్టం కడుతు న్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్‌ అన్నారు. కూటమిని గెలిపించేందుకు ఓటర్లు బారులు తీరారని ఆయన అన్నారు. పోలింగ్‌ జరిగిన తీరుపై ఆయన మంగళవారం గుంటూరులో విలేకరుల సమావేశం నిర్వహించా రు. కేంద్రంలో మరోసారి మోదీ ప్రధానమంత్రి అవుతారు అనటంలో ఏ మాత్రం సందేహం లేదని నరేంద్ర కుమార్‌ అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు సీఎం అవు తారని అన్నారు. నరేంద్ర మోడీ వల్లనే ఈ రాష్ట్రం అభివృద్థి చెందుతుందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పోలవరానికి ఇప్పటికి డబ్బులు ఇస్తుం దని, అమరావతి రాజధానికి కట్టుబడి ఉందని అన్నారు. మంగళగిరిలో కేంద్రం నిర్మించిన ఎయిమ్స్‌ హాస్పిటల్‌ కూడా ఈ రోజున ప్రజలకు ఎంతో ఉపయోగపడు తుందన్నారు. పార్లమెంట్‌కు పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరు ప్రజలకి ఎంతో దగ్గరయ్యారని వనమా అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యకదర్శి చరక కుమార్‌ గౌడ్‌, ఉపాధ్యక్షుడు తులసి యోగేష్‌, పెరుమాళ్ళ అనంత పద్మనాభం, మంత్రి సుగుణ, పొన్నూరు అసెంబ్లీ కన్వీనర్‌ వరికూటి వీర సుధాకర్‌, మండల అధ్యక్షులు పెమ్మరాజు సుధాకర్‌, సురేష్‌ జైన్‌, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ చైతన్య, జిల్లా కార్యవర్గ సభ్యులు రమాదేవి పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2024 | 12:24 AM