Share News

ఉత్తమ ప్రదర్శనగా ఇంద్రప్రస్థం

ABN , Publish Date - May 20 , 2024 | 01:21 AM

రూరల్‌ మండలం కొలకలూరులో జరిగిన ఆహ్వాన నాటికల పోటీలలో గుంటూరు అభినయ ఆర్ట్స్‌ కళాకారులు ప్రదర్శించిన ఇంద్ర ప్రస్థం నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది.

ఉత్తమ ప్రదర్శనగా ఇంద్రప్రస్థం
నటుడు, దర్శకుడు సాంబయ్యకు సుబ్రహ్మణ్యశర్మ పురస్కారం ప్రదానం చేస్తున్న సినీ రచయిత సాయిమాధవ్‌, విజయ్‌ తదితరులు

తెనాలి అర్బన్‌, మే 19: రూరల్‌ మండలం కొలకలూరులో జరిగిన ఆహ్వాన నాటికల పోటీలలో గుంటూరు అభినయ ఆర్ట్స్‌ కళాకారులు ప్రదర్శించిన ఇంద్ర ప్రస్థం నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. కొలంకపురి, వైకే నాటక కళాపరిషత్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో విజేతలకు ఆదివారం బహుమతులు అందజేశారు. ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా గోవాడ క్రియేషన్స్‌ వారి మూల్యం నాటిక, ఉత్తమ తృతీయ ప్రదర్శనగా శర్వాణి గ్రామీణ సమాఖ్య వారి కొత్తపరిమళం బహుమతులు అందుకుంది. ఉత్తమ నటిగా జ్యోతిరాజు, ఉత్తమ నటుడుగా రవీంద్రారెడ్డి, ఉత్తమ దర్శకుడిగా రవీంద్రారెడ్డి, ఉత్తమ రచయితగా గందం నాగరాజు, ఉత్తమ సంగీతం ఎం.నాగరాజు, ఉత్తమ ఆహార్యం పి.శేషగిరి, రంగాలంకరణ సింగూరు రమణ, డైలాగ్‌ ఆర్టిస్టుగా గోవాడ వెంకట్‌, బాలనటునిగా భార్గవ్‌నందన్‌, హాస్యనటుడిగా సురేంద్రబాబు, ప్రతినాయకుడిగా వెంకటరాజు బహుమతులు అందుకోగా జ్యూరీ బహుమతులను నడింపల్లి వెంకటేశ్వర్లు, సీహెచ్‌ కార్తీక్‌, రామాంజనేయులు, భుజంగరావు అందుకున్నారు. న్యాయనిర్ణేతలుగా బి.నరసయ్య, వి.లక్ష్మీకాంతారావు, వై.ఎ్‌స.స్వామి వ్యవహరించారు. గోపరాజు వెంకట శివరామ సుబ్రహ్మణ్యశర్మ జీవిత సాఫల్య పురస్కారాన్ని నటుడు, దర్శకుడు నూతలపాటి సాంబయ్యకు ప్రదానం చేశారు. సినీ దర్శకుడు బుర్రా సాయిమాధవ్‌, గోపరాజు విజయ్‌, గోపరాజు రమణ, చెరుకుమల్లి సింగారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2024 | 01:21 AM