Share News

టీడీపీ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోం

ABN , Publish Date - May 16 , 2024 | 01:11 AM

టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని పొన్నూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌ హెచ్చరించారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో నరేంద్ర మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

టీడీపీ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోం

ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ హెచ్చరిక

పొన్నూరుటౌన్‌,మే15: టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని పొన్నూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌ హెచ్చరించారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో నరేంద్ర మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లోవచ్చిన ప్రజాస్పందన ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో జగన్‌రెడ్డి అరాచకాలను అంతం పలికేందుకు ప్రజలు కసిగా ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద అసౌకర్యంగా ఉన్నప్పటికి గంటల తరబడి వేచివుండి క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవటం వైసీపీ ప్రభుత్వంపై ఉన్న ప్రజాగ్రహానికి నిదర్శనంగా పేర్కొన్నారు. సౌకర్యాలు మెరుగ్గా ఉంటే పోలింగ్‌ శాతం మరింత పెరిగే అవకాశం ఉండేదన్నారు. గ్రామస్థాయి నుంచి సమన్వయంతో పనిచేయటం వల్ల ఎన్నికల ఫలితాలు ఊహించని స్థాయిలో ఉంటాయన్నారు. కొత్త ప్రభుత్వంలో అమలు చేసే సంక్షేమ పఽథకాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లటంలో కూటమి శ్రేణులు విజయవంతం అయ్యారని అభినందించారు. ఎన్నికల కోడ్‌ కన్న ముందే నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్లి ప్రతి తలుపు తట్టి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. ప్రజలు తెలియజేసిన ప్రతి సమస్యను నివేధికగా రూపొందించి నూతన ప్రభుత్వంలో పరిష్కరిస్తామని తెలిపారు. పోలింగ్‌ సందర్భంగా వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడినప్పటికి టీడీపీ ఏజెంట్లు పోలింగ్‌ ప్రక్రీయ సజావుగా సాగేలా సమన్వయంతో వ్యవహరించారని కొనియాడారు. కొన్ని గ్రామాల్లో అధికార పార్టీ నేతలు తప్పుడు ఫిర్యాదులు చేసి అధికారులను తప్పు దోవ పట్టించారని ఆరోపించారు. వైసీపీ అభ్యర్థి చింతలపూడి గ్రామంలో పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశించి అలజడి సృష్టించటానికి ప్రయత్నించారని ఆరోపించారు. పొన్నూరులో టీడీపీ రిగ్గింగ్‌ చేసినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుడు ఆరోపణలు చేయటం నిరాశ, నిస్పృహలకు నిదర్శనం అన్నారు. వైసీపీకి చెందినవారు అనమర్లపూడి గ్రామంలో దళితులను కులం పేరుతో దూషించి కొట్టారని, టీడీపీకి ఓటు వేయలేదని, విధ్యుత్‌ సరఫనా నిలిపివేసి దాడులు చేసారని ఆరోపించారు. పల్నాడు, చంద్రగిరి ప్రాంతాలో జరుగుతున్న దాడులు చూస్తుంటే పోలీసులు ఉన్నారా లేరా అని అనుమానం కలుగుతందన్నారు. త్వరలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని నరేంద్ర ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

ఈవీఎంల భద్రత పెంచాలి...

స్ర్టాంగ్‌ రూమ్‌లో ఈవీఎంల భద్రతపై పొన్నూరు కూటమి అభ్యర్థి ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌ బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ముకేష్‌ మీనాకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్ర్టాంగ్‌ రూమ్‌ వద్ద సీఎం భద్రతా సిబ్బంది భేటీ అయిన విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు,. ఈ నెల 14న నాగార్జు యూనివర్సిటీలో సీఎం భద్రతా సిబ్బంది భేటీ అవటం నిబంధనలకు విరుద్ధం అన్నారు. ఈ సమావేశంలో సిద్ధం పోస్టర్లను ప్రదర్శించారని, వైసీపీ నాయకులు కూడా పాల్గొన్నట్లు ఆరోపించారు. ఈ పరిణామాల నేపఽథ్యంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ర్టాంగ్‌ రూముల వద్ద భద్రతను పెంచాలని కోరారు. ఓటమి భయంతో వైసీపీ కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - May 16 , 2024 | 01:11 AM