ఐటిఐ కళాశాలలో నిరుద్యోగ యువతకు శిక్షణ
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:26 PM
జిల్లాలో నిరుద్యోగ యువతకు ఐటిఐ కళాశాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ సాయివరప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

గుంటూరు(విద్య), జూన్ 7: జిల్లాలో నిరుద్యోగ యువతకు ఐటిఐ కళాశాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ సాయివరప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫిట్టర్, హెల్పర్, ఎలక్ట్రిషియన్, ఆటోమొబైల్‌వాషర్ తదితర ట్రేడుల్లో ముడునెలల పాటు శిక్షణ ఇస్తామని, తరువాత పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాది అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఇతర వివరాల కోసం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో 8074607278, 8333973929లో సంప్రదించాలని సూచించారు.