Share News

డెల్టా రైలుకు వేమూరు, పిడుగురాళ్లలో నిలుపుదల కల్పించాలి

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:29 PM

రేపల్లె - సికింద్రాబాద్‌ డెల్టా ఎక్స్‌ప్రెస్‌కి ప్రయాణికుల సౌకర్యార్థం గతంలో వలె వేమూరు, పిడుగురాళ్ల ేస్టషన్‌లలో నిలుపుదల చేయాలని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సంప్రదింపుల కమిటీ సభ్యులు అంగిరేకుల వరప్రసాద్‌ యాదవ్‌, మద్దాల సుబ్బయ్యలు డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఏ శ్రీధర్‌కు విజ్ఞప్తి చేశారు.

డెల్టా రైలుకు వేమూరు, పిడుగురాళ్లలో నిలుపుదల కల్పించాలి
దక్షిణ మధ్య రైల్వే డీజీఎంకు వినతిపత్రం అందజేస్తున్న జెడ్‌ఆర్‌యూసీసీ సభ్యులు

గుంటూరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): రేపల్లె - సికింద్రాబాద్‌ డెల్టా ఎక్స్‌ప్రెస్‌కి ప్రయాణికుల సౌకర్యార్థం గతంలో వలె వేమూరు, పిడుగురాళ్ల ేస్టషన్‌లలో నిలుపుదల చేయాలని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సంప్రదింపుల కమిటీ సభ్యులు అంగిరేకుల వరప్రసాద్‌ యాదవ్‌, మద్దాల సుబ్బయ్యలు డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఏ శ్రీధర్‌కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సికింద్రాబాద్‌ రైలు నిలయంలోని ఆయన కార్యాలయంలో వరప్రసాద్‌ యాదవ్‌, సభ్యులు కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. తాము గత 75వ జెడ్‌ఆర్‌యుసిసి సమావేశంలో పై సమస్యలను రైల్వే జీఎం దృష్టికి తీసుకువచ్చామన్నారు. తమ ప్రాంతాల ప్రజాప్రతినిధులు, పార్లమెంట్‌ సభ్యులు సైతం ఈ సమస్యలు రైల్వే మంత్రికి, రైల్వే బోర్డ్‌ చైర్మన్‌కి విజ్ఞప్తి చేసినప్పటికీ నేటి వరకు ఈ ప్రాంతాల్లో డెల్టా రైలుని నిలుపుదల చేయకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి ,అసహనానికి గురవుతున్నారని చెప్పారు. అలాగే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని డివిజన్లో ఆర్పీఎఫ్‌ సిబ్బందిని పెంచేందుకు తక్షణం నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ేసఫ్టీ మేనేజర్‌ ఠాకూర్‌ని కలిసి వరప్రసాద్‌ యాదవ్‌ విజ్ఞప్తి చేశారు. గుంటూరు విజయవాడ డివిజన్ల ముఖ్య ేస్టషన్ల వద్ద గంజాయి అమ్మకం, అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోయాయని వాటిని నియంత్రించేందుకు సరైన సంఖ్య సిబ్బంది లేరన్నారు. గుంటూరు నగరంలోని ట్రాఫిక్‌ ను అధికమించేందుకు గుంటూరు అరండల్‌పేట ఆర్వోబిని విస్తరణకు యుద్థ ప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలని, శ్యామల నగర్‌, నెహ్రూ నగర్‌, గడ్డి పాడుల వద్ద ఆర్వోబీ, ఆర్‌యుబిల నిర్మాణానికి డిపిఆర్‌లను వెంటనే సిద్థం చేేస విధంగా చర్యలు తీసుకోవాలని డీజీఎంకి విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jul 05 , 2024 | 11:30 PM