Share News

దశావతార వెంకన్న సేవలో భువనేశ్వరి, బ్రాహ్మణి

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:22 PM

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట గల శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రాన్ని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, మాజీమంత్రి నారా లోకేష్‌ సతీమణి బ్రాహ్మణిలు దర్శించారు.

దశావతార వెంకన్న సేవలో భువనేశ్వరి, బ్రాహ్మణి
వేద పండితుల ఆశీర్వచనం పొందుతున్న భువనేశ్వరి, బ్రాహ్మణి

పెదకాకాని, జూన్‌7: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట గల శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రాన్ని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, మాజీమంత్రి నారా లోకేష్‌ సతీమణి బ్రాహ్మణిలు దర్శించారు. శుక్రవారం ఆలయాన్ని సందర్శించిన వారికి ఆలయ మర్యాదలతో ఆలయ ధర్మకర్త లింగమనేని పూర్ణ భాస్కరరావు, స్వర్ణకుమారి దంపతులు, ఆలయ అర్చకులు, వేద పండితులు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రదక్షిణ నిర్వహించి, దశావతార వెంకటేశ్వర స్వామికి, మహాలక్ష్మి అమ్మవారికి, విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయంలోని నాగేంద్రస్వామిని దర్శించి పూజలు జరిపించారు. అనంతరం భువనేశ్వరి, బ్రాహ్మణి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌ సతీమణి శ్రీరత్నలకు వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనాన్ని అందజేశారు. కార్యక్రమంలో లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్‌ ప్రశాంతి దంపతులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 11:22 PM