ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుంది
ABN , Publish Date - May 12 , 2024 | 01:46 AM
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని కూటమి అసెంబ్లీ అభ్యర్ధి చదలవాడ అరవిందబాబు తెలిపారు. మండలంలోని కొత్లపల్లి, చాకలికుంట, ఎడ్వర్డుపేట గ్రామాల్లో శుక్రవారం రాత్రి ఆయన పర్యటించారు.

కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అరవింద బాబు
రొంపిచర్ల, మే 11: రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని కూటమి అసెంబ్లీ అభ్యర్ధి చదలవాడ అరవిందబాబు తెలిపారు. మండలంలోని కొత్లపల్లి, చాకలికుంట, ఎడ్వర్డుపేట గ్రామాల్లో శుక్రవారం రాత్రి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గ్రామంలో పలు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టబోతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సూపర్ - 6 పథకాల గురించి వివరించారు. ఆయా కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.