Share News

స్ర్టాంగ్‌రూమ్‌ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - May 16 , 2024 | 01:06 AM

బాపట్ల లోక్‌సభ పరిధిలోని ఈవీఎంలను భద్రపరిచిన ఇంజనీరింగ్‌ కళాశాలలోనిస్ర్టాంగ్‌రూమ్‌ల వద్ద అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా తెలిపారు. భద్రతా ఏర్పాట్లపై బుధవారం ఎస్పీ వకుల్‌ జిందాల్‌తో కలిసి ఆయన పరిశీలించారు.

స్ర్టాంగ్‌రూమ్‌ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి
స్ర్టాంగ్‌రూమ్‌ల వద్ద భద్రతపై సూచనలు చేస్తున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా, ఎస్పీ వకుల్‌ జిందాల్‌

ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి పి.రంజిత్‌బాషా

బాపట్ల, మే 15: బాపట్ల లోక్‌సభ పరిధిలోని ఈవీఎంలను భద్రపరిచిన ఇంజనీరింగ్‌ కళాశాలలోనిస్ర్టాంగ్‌రూమ్‌ల వద్ద అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా తెలిపారు. భద్రతా ఏర్పాట్లపై బుధవారం ఎస్పీ వకుల్‌ జిందాల్‌తో కలిసి ఆయన పరిశీలించారు. కంట్రోల్‌రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల ఫుటేజిలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. స్ర్టాంగ్‌రూమ్‌ల వద్ద విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ విఠలేశ్వర్‌, డీఎస్పీ సి.హెచ్‌.మురళీకృష్ణ, ఎలక్షన్‌సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాసరెడ్డి, రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ వై.శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

రీపోలింగ్‌ లేకుండా ఎన్నికలు

జిల్లా వ్యాప్తంగా సాధారణ ఎన్నికలను రీపోలింగ్‌కు అవకాశం లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా ఎన్నికల అధికారి రంజిత్‌బాషా తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలనే సంకల్పంతో ప్రజలు ఓటు వేశారని అందుకే ఓటింగ్‌శాతం పెరిగిందని చెప్పారు. పోలింగ్‌ రోజున గడువు ముగిసన తర్వాత కూడా 250 కేంద్రాల్లో పోలింగ్‌ జరిగిందన్నారు. ఎస్పీ వకుల్‌ జిందాల్‌ మాట్లాడుతూ పోలింగ్‌ రోజున కేంద్రాల బయట మాత్రమే చిన్నచిన్న ఘర్షణలు జరిగాయన్నారు. 30 కేసులు నమోదు చేసి అందులో 241 మందిని నిందితులుగా చేర్చామన్నారు. సమావేశంలో డీఆర్వో సత్తిబాబు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2024 | 01:06 AM