Share News

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:25 AM

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ ఎస్‌.శ్రీనివాస్‌కుమార్‌ తెలిపారు.

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి

బాపట్ల, జూన్‌ 1 : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ ఎస్‌.శ్రీనివాస్‌కుమార్‌ తెలిపారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా జిల్లా వ్యాప్త ప్రత్యేక తనిఖీలలో భాగంగా శనివారం బాపట్ల పట్టణంలోని డిస్ర్టిక్‌ టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో హోటల్స్‌, బేకరీలు, మెకానిక్‌షాపులు, ఇతర షాపులను తనిఖీ చేశారు. షాపు యజమానులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలను పనిలో పెట్టుకోరాదని, అలా ఎవరైనా చట్ట వ్యతిరేకంగా పిల్లలను పనిలో పెట్టుకున్నట్లైతే వారిపై చైల్డ్‌ లేబర్‌ యాక్ట్‌ ప్రకారం శిక్ష, జరిమాన విధించటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో లేబర్‌ ఆఫీసర్‌ ఆర్‌.అబ్రహం, రామకృష్ణ, స్వచ్ఛంద సేవాసంస్థ ప్రతినిధులు బడుగు కిషోర్‌, ఎం.నాగరాజు, రాజ సాల్మన్‌, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2024 | 12:25 AM