నవీకరణ కాని ఇన్‌చార్జ్ తహసీల్దార్ సంతకం
ABN , Publish Date - May 26 , 2024 | 01:03 AM
నాదెండ్ల ఇన్‌చార్జ్ తహసీల్దార్‌గా పనిచేస్తున్న యడ్లపాడు తహసీల్దార్ అస్రీఫ్ ఉన్నీసాబేగం డిజిటల్ సంతకం నవీకరణ కాకపోవటంతో పలువురు దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నాదెండ్ల, మే 25: నాదెండ్ల ఇన్‌చార్జ్ తహసీల్దార్‌గా పనిచేస్తున్న యడ్లపాడు తహసీల్దార్ అస్రీఫ్ ఉన్నీసాబేగం డిజిటల్ సంతకం నవీకరణ కాకపోవటంతో పలువురు దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన 7వ తేదీన నాదెండ్ల తహసీల్దార్‌గా పనిచేస్తున్న వరకుమార్ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో జరిగిన తప్పిదంతో సస్పెండ్ అయ్యారు. అప్పటినుంచి ఆయన స్థానంలో ఇన్‌చార్జ్‌గా యడ్లపాడు తహసీల్దార్‌ను నియమించారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి గురుకుల, మోడల్ తదితర పాఠశాలల్లో ప్రవేశానికి కుల, ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాలు అవసరం. కాని ఇంతవరకు ఇన్‌చార్జ్ తహసీల్దార్ డిజిటల్ సంతకం ఆన్‌లైన్‌లో నవీకరణ(అప్‌డేట్) కాలేదు. దీంతో దరఖాస్తు చేసిన విద్యార్థులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఇన్‌చార్జ్ తహసీల్దార్‌ను వివరణ కోరగా రెండు రోజులుగా నవీకరణ కోసం ప్రయత్నిస్తున్నా సాంకేతిక సమస్యతో తన సంతకం నవీకరణ కావటం లేదని, శనివారం ఈ సమస్య పరిష్కారం కోసం నేషనల్ ఇన్ఫర్‌మ్యాటిక్ సెంటర్‌కు వెళ్తున్నానని వివరించారు. సోమవారం నాటికి సమస్య పరిష్కారం కావచ్చని ఆమె వివరించారు.