Share News

నసీర్‌కు బ్రాహ్మణులు మద్దతు తెలియజేయాలి

ABN , Publish Date - May 12 , 2024 | 12:46 AM

గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎన్డీయే కూటమి అభ్యర్ధి ఎండీ నసీర్‌ అహ్మద్‌కు సోమవారం జరగబోయే ఎన్నికల్లో బ్రాహ్మణు లంతా మద్దతు తెలియజేసి గెలిపించాలని టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్‌శర్మ పిలుపుని చ్చారు.

 నసీర్‌కు బ్రాహ్మణులు మద్దతు తెలియజేయాలి

గుంటూరు మే 11 : గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎన్డీయే కూటమి అభ్యర్ధి ఎండీ నసీర్‌ అహ్మద్‌కు సోమవారం జరగబోయే ఎన్నికల్లో బ్రాహ్మణు లంతా మద్దతు తెలియజేసి గెలిపించాలని టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్‌శర్మ పిలుపుని చ్చారు. ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా గుంటూరు తూర్పు నియోజక వర్గం ఎన్డీయే కూటమి అభ్యర్ధి ఎండీ నసీర్‌ అహ్మద్‌ను కన్యకాపరమేశ్వరి గుడి దగ్గర భారీ ర్యాలీలో బ్రాహ్మణ నాయకులతో కలసి సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం సతీష్‌ శర్మ మాట్లాడుతూ సౌమ్యుడు, స్నేహశీలి, సమస్యలు తెలిసిన వ్యక్తి నసీర్‌ అహ్మద్‌ అని కొనియాడారు, తూర్పు నియోజకవర్గంలోని బ్రాహ్మణు లు సైకిల్‌ గుర్తు పై ఓటు వేసి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్‌ అహ్మద్‌లను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. వైసీపీ ప్రభుత్వంలో విదేశీ విద్య పథకం అటకెక్కించారని, 99 మంది బ్రాహ్మణ విద్యా ర్థులు దరఖాస్తు చేసుకుంటే ఐదేళ్లు కళ్లు కాయలుకాచేలా ఎదురు చూశారని ఆవేదన వెలిబుచ్చారు. ఇతర సామాజికవర్గాలు కోర్టులను ఆశ్రయించి విదేశీ విద్య లబ్ధిపొందారని, బ్రాహ్మణులు కోర్టులకు వెళ్ళలేక చదువులు మధ్యలో ఆపలేక అప్పులు చేసి ఇబ్బందులు పడ్డారని, ఇటువంటి పరిస్థితులు మరెవరికీ రాకూడదని అన్నారు. రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు సీఎం అయితేనే అందరికీ మేలు జర ుగుతుందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేత పాటిబండ్ల విజయ్‌, దాసరి శ్రీనివాస్‌, మన్నేపల్లి హనుమంతుశర్మ, శంకరమంచి లలితా శాస్ర్తి, శ్రీనివాస్‌ శర్మ, తిరుమలరావు గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2024 | 12:46 AM