వైసీపీ నుంచి టీడీపీలో చేరికలు
ABN , Publish Date - May 12 , 2024 | 01:04 AM
మండలపరిధిలోని పమిడివారిపాలెంకు చెందిన 20 వైసీపీ కుటుంబాలు శనివారం టీడీపీలో చేరారు.

పెదనందిపాడు, మే 11: మండలపరిధిలోని పమిడివారిపాలెంకు చెందిన 20 వైసీపీ కుటుంబాలు శనివారం టీడీపీలో చేరారు. గుంటూరులోని ప్రత్తిపాడు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులు సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రత్తిపాటి రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.