Share News

కౌంటింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలి

ABN , Publish Date - May 24 , 2024 | 01:11 AM

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి జూన 4వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేందుకు అభ్య ర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లు సహకరించాలని జాయంట్‌ కలెక్టరు, మంగళ గిరి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాజకుమారి కోరారు.

కౌంటింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్వో రాజకుమారి

మంగళగిరి సిటీ, మే 23: మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి జూన 4వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేందుకు అభ్య ర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లు సహకరించాలని జాయంట్‌ కలెక్టరు, మంగళ గిరి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాజకుమారి కోరారు. మంగళగిరి ఆర్వో కార్యాలయంలో గురువారం ఆమె వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు, కౌంటింగ్‌ ఏజెంట్లతో సమావేశం ఏర్పాటు చేసి కౌంటింగ్‌ ప్రక్రియ వివరాలను తెలియజేశారు. ఆర్వో రాజకుమారి మాట్లాడుతూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని సివిల్‌, మెకానికల్‌ బ్లాకు మొద టి అంతస్తు రూమ్‌ నెం: 206లో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. 4వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుందని, అభ్యర్థులు, వారి తాలూకూ ఏజెంట్లు ఉదయం ఆరున్నర గంటల కల్లా కౌంటింగ్‌ హాలుకు చేరుకోవాలని సూచించారు. మొబైల్‌ ఫోన్లు లోపలికి అనుమ తించరని చెప్పారు. అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లు ఎన్నికల సిబ్బందికి సహకరించాలని, కౌంటింగ్‌ హాల్లో ప్రశాంతతకు భంగం కలిగించని కౌం టింగ్‌ ఏజెంట్లను నియమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రిటర్నింగ్‌ అధికా రి కార్యాలయంలోని సా్ట్రంగ్‌ రూంలో భద్రపరిచిన పోస్టల్‌ బ్యాలెట్‌ను కౌంటింగ్‌కు ముందురోజు సాయంత్రం అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో యూనివర్సిటీలోని మెకానికల్‌ బ్లాకు మొదటి అంతస్తు రూమ్‌ నెం.216లో భద్రపరుస్తారన్నారు. కౌంటింగ్‌ హాల్లో ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ లోక్కింపు కోసం మూడు టేబుళ్లు, ఈటీపీబీఎస్‌ లెక్కింపునకు ఒక టేబుల్‌ ఏర్పాటు చేస్తా మని, టేబుళ్ల వారీగా కౌంటింగ్‌ ఏజెంట్లను నియమించుకోవాలని ఆర్వో రాజకుమారి సూచించారు.

Updated Date - May 24 , 2024 | 01:11 AM