ప్రజాదర్బార్‌లో రాష్ట్రవ్యాప్త వినతులు
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:27 PM
కష్టాల్లో ఉన్న ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తూ లోకేశ్ సరికొత్త సాంప్రదయానికి వేదికగా ఏర్పాటుచేసిన ప్రజా దర్బార్‌లో ప్రజలనుండి వస్తున్న వినతులు స్వీకరిస్తున్నారు.

తాడేపల్లి, జులై 5: కష్టాల్లో ఉన్న ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తూ లోకేశ్ సరికొత్త సాంప్రదయానికి వేదికగా ఏర్పాటుచేసిన ప్రజా దర్బార్‌లో ప్రజలనుండి వస్తున్న వినతులు స్వీకరిస్తున్నారు. మంగళగి రి నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుం డి భారీగా ప్రజలు విచ్చేసి తమ సమస్యలు అర్జీల రూపంలో విన్నవి స్తున్నారు. పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఉద్యోగా ల కోసం, సమస్యల పరిష్కారం కోసం వివిధ విభాగాల ఉద్యోగులు, విద్య, వైద్యసాయం కోసం సామాన్యులు, కష్టాల నుండి గట్టెక్కేందుకు బాధితులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. వారి సమస్యలు విన్న లోకేశ్ ఆయా శాఖలకు వినతిపత్రాలు పంపిస్తున్నారు.
గంజాయి మత్తులో దాడులకు పాల్పడుతున్నారు...
తాడేపల్లి పట్టణం సీతానగరం గోరాకాలనీకి చెందిన పలువురు యువకులు గంజాయి మత్తులో దాడులకు పాల్పడుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వారిపై తగినచర్యలు తీసుకోవాల ని బాధితులు కే ఆంజనేయప్రసాద్, మాచర్ల అఖిల్ మంత్రి లోకేశ్‌కు విజ్ఞప్తిచేశారు. స్థానికంగా ఉండే కట్టా భరత్ గంజాయి మత్తులో కత్తి తో దాడిచేయగా తాను తీవ్రంగా గాయపడ్డానని, ఇరుగుపొరుగు వారు ప్రాణాలు రక్షించారని వివరించారు. తన సెల్‌ఫోన్, నగదు భరత్ లాక్కున్నాడని, తల్లిదండ్రులను హతమారుస్తానని బెదిరిం చా డని వాపోయాడు. పోలీసులకు ఫిర్యాదుచేసినా స్పందనలేదన్నారు. గంజాయి బ్యాచ్‌నుంచి తనకు భద్రత కల్పించాలని కోరాడు. గంజా యిబ్యాచ్ ఆగడాలు అరికడతామని లోకేశ్ హామీ ఇచ్చారు.
దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలి
మంచానికే పరిమితమైన తన కుమార్తెకు దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని గుంటుపల్లికి చెందిన వెలమాటి శ్రీనివాసకుమార్ కోరారు. రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్‌లో పనిచేస్తున్న బోధనా, బోధనేతర సిబ్బందికి మినిమం టైమ్‌స్కేల్ వర్తింపజేయాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు. విద్యుత్ బిల్లుల కారణంగా గత ప్రభుత్వం తొలగించిన రేషన్‌కార్డు, పెన్షన్ పునరుద్ధరించాలని మంగళగిరికి చెందిన వీ వీరభద్రరావు, లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్నానని, తన ఇద్దరు పిల్లల చదువు భారంగా మారిందని, ఆర్థికసాయం చేయాలని ఉండవల్లికి చెందిన వై దుర్గ కోరారు. డిగ్రీ చదివిన తనకు ఉద్యోగం లేక కుటుంబపోషణ భారంగా మారిందని ఏదైనా ఉద్యోగం కల్పించాలని విజయవాడకు చెందిన మడక రమ్య విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు.
నేడు, రేపు ప్రజాదర్బార్‌కు సెలవు
శని, ఆదివారాలు ప్రజాదర్బార్ కార్యక్రమం ఉండదని తదుపరి ప్రజాదర్బార్ తేదీని ప్రకటిస్తామని లోకేశ్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అర్జీదారులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.