Share News

అప్రమత్తతో విధులు నిర్వహించాలని

ABN , Publish Date - May 12 , 2024 | 01:23 AM

ఎన్నికల సిబ్బంది అప్రమత్తతో విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శివశంకర్‌ ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా అధికారులు నోడల్‌ అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బందితో ఆయన సమీక్షించారు.

అప్రమత్తతో విధులు నిర్వహించాలని
సమావేశంలో కలెక్టర్‌ శివశంకర్‌

నరసరావుపేట, మే 11: ఎన్నికల సిబ్బంది అప్రమత్తతో విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శివశంకర్‌ ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా అధికారులు నోడల్‌ అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బందితో ఆయన సమీక్షించారు. ఎన్నికలకు సంబంధించి నిర్ధేశిత నివేదికలు అన్నీ సకాలంలో అందజేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మంగళవారం మధ్యాహ్నం వరకు సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని చెప్పారు. వెబ్‌ కాస్టింగ్‌, కమాండ్‌ కంట్రోల్‌, కమ్యూనికేషన్‌, మీడియా మానిటరింగ్‌ కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి వివరాలు సిబ్బంది అందరి దగ్గర అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విధులు నిర్వహిస్తున్న ఆర్‌వో పోలీసు సిబ్బంది వివరాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. వెబ్‌ కాస్టింగ్‌ కు సంబంధించి నియోజకవర్గానికి ఒకరు ఎన్నికల రోజున సాయంత్రం 7:00 గంటల వరకు నిఘా ఉంచాలని సూచించారు. మీడియా కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఎప్పటికప్పుడు ఎలకా్ట్రనిక్‌ మీడియాలో ప్రసారమవుతున్న ప్రతికూల వార్తలను స్ర్కీన్‌ షాట్‌ తీసి సంబంధిత కంట్రోల్‌ రూమ్‌కు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ, డీఆర్వో వినాయకం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2024 | 01:23 AM