పిడుగురాళ్లలో ప్రబలిన డయేరియా
ABN , Publish Date - Jul 06 , 2024 | 01:02 AM
పిడుగురాళ్ల పట్టణంలో డయేరియా ప్రభలు తోంది. సున్నంబట్టీల పరిసర ప్రాంతాలలో తాగు నీటి కాలుష్యంతో డయేరియా వ్యాప్తి చెందింది.
శుక్రవారం 15 మంది ఆస్పత్రిపాలు
వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో అధికారుల పర్యటన
వైద్యాధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే యరపతినేని
పిడుగురాళ్ల, జూలై5: పిడుగురాళ్ల పట్టణంలో డయేరియా ప్రభలు తోంది. సున్నంబట్టీల పరిసర ప్రాంతాలలో తాగు నీటి కాలుష్యంతో డయేరియా వ్యాప్తి చెందింది. రెండు రోజుల క్రితం అబుబాక సిద్దిక్ (9) అనే బాలుడు మృతిచెందాడు. దీంతో అప్రమత్తమైన మున్సిపల్, వైద్యాధికారులు ఆయా ప్రాంతాలలో పారిశుధ్య చర్యలకు ఉపక్రమిం చారు. అయినప్పటికీ శుక్రవారం 15 మంది వాంతులు, విరేచనాలతో లెనిన్‌నగర్, పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. డయేరియా మరింత ప్రబలకుండా అధికారులు ఆయా ప్రాంతాలలో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. వైద్యాధికారులు అందుబాటులో వుండి వైద్యసేవలు అందించడంతో శుక్రవారం సాయంత్రానికి పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది.
స్పందించిన ఎమ్మెల్యే యరపతినేని..
లెనిన్‌నగర్, మారుతీనగర్ ప్రాంతాలలో డయేరియా ప్రబలిన విషయం తెలుసుకున్న గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు శుక్రవారం వెంటనే స్పందించి మున్సిపల్, వైద్యాధికారులతో మాట్లాడారు. డయేరియాను అదుపుచేసేందుకు కావలసిన మందు లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, పారిశుఽధ్య మెరుగు దలకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పరిసరాల శుభ్రతపై మున్సిపల్ అధికారుల తనిఖీ
లెనిన్‌నగర్, మారుతీనగర్ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా వుంచాలని మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ రవీంద్రబాబు ఆదేశించారు. లెనిన్‌నగర్ పరిసర ప్రాంతాలలో రెండు రోజులుగా డయేరియా ప్రబలడంతో కొందరు వైద్య చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ఆయా ప్రాంతాలలో పారిశుధ్య మెరుగుకు తీసుకుం టున్న చర్యలను శుక్రవారం మున్సిపల్ ఆర్డీ పరిశీలించారు. డయేరి యా రావడానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులను వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో నీటిశాంపిల్స్‌ను సేకరించారు. కార్యక్ర మంలో మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ రవీంద్రబాబు, కమిషనర్ గిరి కుమార్, ఏఈ రాఘవేంద్ర, పలువురు అధికారులు, పాల్గొన్నారు.