చేనేతకు పూర్వవైభవం లోకేశతోనే సాధ్యం
ABN , Publish Date - May 12 , 2024 | 12:59 AM
మంగళగిరి చేనేతకు పూర్వవైభవం తీసుకురావడం నారా లోకేశతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నా రు.

మంగళగిరి, మే 11: మంగళగిరి చేనేతకు పూర్వవైభవం తీసుకురావడం నారా లోకేశతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నా రు. జనసేన, బీజేపీ బలపరిచిన మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ విజయాన్ని కాంక్షిస్తూ శనివారం పట్టణంలోని లక్ష్మీనరసింహ స్వామి కాల నీ, సుందరయ్య నగర్, శ్రామికనగర్, సూర్యనారాయణ నగర్, ఆంజనేయ కాలనీ, వీవర్స్ కాలనీ, సాయినగర్ ప్రాంతాల్లో ఆమె ప్రచారం నిర్వహిం చారు. ఎమ్మెల్సీ అనురాధ మాట్లాడుతూ జగన రాక్షస పాలనలో చేనేత చిన్నాభిన్నమైందన్నారు. ప్రాభవం కోల్పోతున్న చేనేతకు ప్రాణం పోయాల ని లోకేశ సంకల్పించారని, ఆ సంకల్పానికి ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. చేనేత కార్మికుల జీవన స్థితిగతులను మెరుగుపరిచి ఆదాయ వనరులను పెంచేందుకు లోకేశ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. భవిష్యత్తు తరాల గురించి ఆలోచించి చేనేత పరిశ్రమ మనుగడకు జీవం పోస్తున్న నారా లోకేశను మంగళగిరి ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి గుత్తికొండ ధనుంజయరావు, నియోజకవర్గ అధ్యక్షుడు కారంపూడి అంకమ్మరావు, నేతలు అలుగూరి రాజశేఖర్, కాశిన కొండలు, జొన్నాదుల నాగమల్లేశ్వరరావు, ఆకురాతి నాగేంద్రం, చిలకా బసవమ్మ, ఒడిశా నరేష్, నందం బాబూరావు, వంగర లక్ష్మయ్య, అనుమల శ్రీను, తాటిపాముల లక్ష్మీపెరుమాళ్లు, అలుగూరి వీరాంజనేయులు, తిరుమలశెట్టి హనుమంత రావు, గద్దె శ్రీమన్నారాయణ, తిరువీధుల అరుణ్‌బాబు, తుమ్మా సర్వే శ్వరరావు, శలా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.