Share News

త్రిముఖ దేవాలయాలను సందర్శించిన అధికారుల బృందం

ABN , Publish Date - May 29 , 2024 | 12:52 AM

మండలంలోని చందోలు గ్రామంలో త్రిముఖ దేవాలయాలైన శ్రీ లింగద్భవస్వామి, శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయాలను రాష్ట్ర దేవదాయ శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు వార్షిక తనిఖీలలో భాగంగా మంగళవారం సందర్శించి పరిశీలించారు.

 త్రిముఖ దేవాలయాలను సందర్శించిన అధికారుల బృందం
శ్రీబగళాముఖి దేవస్థానంలో రాష్ట్ర దేవదాయశాఖ ఇంజనీరింగ్‌ అధికారులను దుశ్శాలువాలతో సత్కరిస్తున్న ఆలయ కార్యనిర్వాహణాధికారి నరసింహమూర్తి

పిట్టలవానిపాలెం, మే 28 : మండలంలోని చందోలు గ్రామంలో త్రిముఖ దేవాలయాలైన శ్రీ లింగద్భవస్వామి, శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయాలను రాష్ట్ర దేవదాయ శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు వార్షిక తనిఖీలలో భాగంగా మంగళవారం సందర్శించి పరిశీలించారు. ముఖ్యకార్యాలయాల ఇంజనీరింగ్‌ అధికారుల బృందం ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి జి.నరసింహమూర్తి ఆధ్వర్యంలో వారికి ప్రత్యేక పూజలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాలను, తీర్దప్రసాదాలను అందజేశారు. తొలుత శ్రీలింగోద్భవస్వామి దేవస్థానంలో జరుగుతున్న పూర్ణాకాలక్షేప ముఖ మండప పనులను పరిశీలించి వాటికి సంబంధించిన కొన్ని సూచనలను ఆలయ కార్యనిర్వాహణాధికారికి ఆదేశిలిచ్చారు. ఇంజనీరింగ్‌ బృందం మాట్లాడుతూ చందోలులో ఉన్న 100 సంవత్సరాల చరిత్ర కలిగిన త్రిముఖ దేవాలయాలైన శ్రీలింగోద్భవస్వామి, శ్రీచెన్నకేశవస్వామి, శ్రీబగళాముఖి అమ్మవారి ఆలయాలను దర్శించుకోవటం ఎంతో పుణ్యఫలమని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ ఈఈ గంగయ్య, దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌లు జ్యోతి, ఉమాచౌదరి, టెక్నికల్‌ ఆఫీసర్‌ బి.రవి, డీఈ జనార్దన, ఏఏలు ఆనంద్‌, మధు, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 12:52 AM