విద్యుత్ కాంతులతో ప్రభుత్వ కార్యాలయాలు
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:11 AM
నియోజకవర్గంలోని బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాలలో, బాపట్ల పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించారు.

బాపట్ల, జూన్ 11 : నియోజకవర్గంలోని బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాలలో, బాపట్ల పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ విధంగా పెద్దఎత్తున విద్యుత్ దీపాలు అలంకరించి నూతన ప్రభుత్వానికి స్వాగతం పలుకుతున్నారు. బాపట్ల తహసీల్దార్ కార్యాలయంతోపాటు ఐసీడీఎస్, మున్సిపల్, సచివాలయాలు, మండల పరిషత్ కార్యాలయాలు మొత్తం అలంకరించారు. అదేవిధంగా బుధవారం ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార మహోత్సవాన్ని వీక్షించేందుకు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో అతిపెద్ద ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేస్తున్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలోని డాక్టర్ బీవీ నాఽధ్ ఆడిటోరియంలో, విజయలక్ష్మీపురం రోటరీకళ్యాణ మండపంలో, మార్కెట్ దగ్గర ఆర్యవైశ్యకల్యాణ మండపంలో ఎల్‌ఈడీ స్ర్కీన్‌ల ద్వారా ప్రత్యక్షప్రసారం వీక్షించే ఏర్పాట్లు చేశారు. తహసీల్దార్ ఎం.శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పార్టీశ్రేణులు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు.