Share News

నీరు పారేదెలా..

ABN , Publish Date - May 21 , 2024 | 01:07 AM

రైతులకు ఏటా రూ.వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తున్నాం.. అన్నదాతకే మొదటి ప్రాధా న్యం.. అంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పు కుంటోంది. అదంతా చేతల్లో కనిపించడం లేదు. నిజంగా రైతుల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి కాలువల్లో పూడికతీతే ఉదాహరణ. పంటల సీజన్‌ మొదలు కావస్తున్నా కనీసం పూడిక కూడా తీయలేని దుస్థితిలో ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసు కోచ్చు. ఏటా ప్రధాన కాలువల్లో పూడిక, కంపచెట్లు తొలగి స్తుంటారు. దెబ్బతిన్న కట్టడాలను పునరు ద్ధ్దరిస్తారు. కానీ ఆ ఊసేలేదు. కాలువల్లో చేపట్టాల్సిన అత్యవసర పనులను ఇప్పటి వరకు జలవనరుల శాఖ గుర్తించలేదు. అయితే పనులు చేపట్టేందుకు ఏకంగా ప్రభుత్వమే అనుమతివ్వడం ఆపేసింది. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పరిశీలిస్తే ఈ ఏడాది కాలువలకు మరమ్మతులు లేనట్లేనని చెప్పవచ్చు. వరుసగా నాలుగవ ఏడాది ప్రభుత్వం సాగర్‌ కాలువల్లో అత్యవసర పనులను చేపట్టడాన్ని విస్మరించింది.

నీరు పారేదెలా..
కాలువలో పెరిగిన కంప చెట్లు

రైతులకు ఏటా రూ.వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తున్నాం.. అన్నదాతకే మొదటి ప్రాధా న్యం.. అంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పు కుంటోంది. అదంతా చేతల్లో కనిపించడం లేదు. నిజంగా రైతుల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి కాలువల్లో పూడికతీతే ఉదాహరణ. పంటల సీజన్‌ మొదలు కావస్తున్నా కనీసం పూడిక కూడా తీయలేని దుస్థితిలో ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసు కోచ్చు. ఏటా ప్రధాన కాలువల్లో పూడిక, కంపచెట్లు తొలగి స్తుంటారు. దెబ్బతిన్న కట్టడాలను పునరు ద్ధ్దరిస్తారు. కానీ ఆ ఊసేలేదు. కాలువల్లో చేపట్టాల్సిన అత్యవసర పనులను ఇప్పటి వరకు జలవనరుల శాఖ గుర్తించలేదు. అయితే పనులు చేపట్టేందుకు ఏకంగా ప్రభుత్వమే అనుమతివ్వడం ఆపేసింది. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పరిశీలిస్తే ఈ ఏడాది కాలువలకు మరమ్మతులు లేనట్లేనని చెప్పవచ్చు. వరుసగా నాలుగవ ఏడాది ప్రభుత్వం సాగర్‌ కాలువల్లో అత్యవసర పనులను చేపట్టడాన్ని విస్మరించింది.

(నరసరావుపేట, ఆంధ్రజ్యోతి)

పంట కాలువల్లో నీరు సజావుగా పారాలంటే సీజన్లో పూడిక తీయడంతోపాటు కాలువల్లో పెరి గిన జమ్ము, కంపచెట్లు తొలగించాలి. అప్పుడే చివరి ఆయకట్టు వరకు నీరందుతుంది. ఏటా ఖరీఫ్‌ ప్రారంభంలోనే ఈ ప్రక్రియకు టెండర్లు పూర్తి చేస్తారు. కాలువలకు నీరు విడుదల కంటే ముందే పనులు పూర్తి చేస్తారు. ఏటా ఇది జరుగుతుండగా గత మూడేళ్లుగా ఆ పరిస్థితి లేదు. గత ఏడాది కాలువల్లో పనులు చేపట్టేం దుకు జలవనురుల శాఖ అందించిన ప్రతిపాదన లను ప్రభుత్వం తిరస్కరించింది. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ఎం)కు పల్నాడు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో పరిధిలోని లింగం గుంట్ల, ఒంగోలు సర్కిల్స్‌ నుంచి అధికారులు ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం వాటిని తిరస్కరించింది. గత ఏడాది సాగు నీటి సంక్షోభంతో సాగు నీరు సరఫరా కాలేదు. కాలువల్లో నీరు పారుదల లేకపో వడంతో అవి అధ్వాన స్థితికి చేరా యి. కాలువల్లో పూడిక తీయా లంటూ రైతులు పలుమార్లు వేడు కుంటున్నా ప్రభుత్వం స్పందించ డంలేదు. మరో రెండువారాల్లో ఖరీఫ్‌ వ్యవసాయ పనులు ప్రారంభం కాను న్నాయి. చివరి ఆయకట్టు వరకు సాఫీగా నీరు పారాలంటే కాలువలను సిద్ధం చేసు కోవాలి. వేసవికాలం కూడా కావడంతో పూడిక తీయకపోతే సాగు కష్టమ వుతుందని నిపుణులు అంటున్నారు.

దారి మళ్లిన నిధులు

సాగర్‌ కాలువల మరమ్మతులకు ఇవ్వాల్సిన నిధుల ను ప్రభుత్వం దారి మళ్లించుకుంది. రైతులు ఏటా నీటి తీరువా చెల్లిస్తారు. నీటి శిస్తు ద్వారా వచ్చిన ఆదా యాన్ని పంచాయతీలకు ఐదుశాతం కేటాయించగా 80 శాతం నిధులను మైనర్‌, మేజర్‌ ఇరిగేషన్‌లకు కేటాయించాలి. గతంలో సాగు నీటి సంఘాలు ఉండేవి. వీటికి ఎన్నికలు జరగకపోవడంతో సంబంధిత అధికారు లకే నీటి సంఘాల బాధ్యతలను అప్పగించారు. ప్రాజెక్టు కమిటీ బాధ్యతలను ఎస్సీకి, డిస్ట్రిబ్యూటరీ కమిటీల బాధ్యతలను ఈఈలకు, నీటి సంఘాల బాధ్యతలను డీఈ, జేఈలకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆయా కమిటీల కాలువల నిర్వహణ పనులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కాగా నీటి తీరువాకు సంబంధించిన నిధులను కూడా కమిటీల వారీగా కేటాయించాలి. వసూలైన నీటి తీరువాలో 80 శాతం నిధులను నీటి సంఘాలకు కేటాయించాలి. ఈ నిధుల్లో సగం మేజర్‌, సగం మైనర్‌ ఇరిగేషన్‌లకు కేటాయించాలి. 10 శాతం పరిపాలనకు వినియోగిస్తారు. 15 శాతం నిధులను డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు, 14 శాతం నిధులను ప్రాజెక్టు కమిటీకి కేటాయించాలి. ఇలా కేటాయింపులు ఐదేళ్లుగా జరుగుతున్న దాఖలాలు లేవు. ఇలా వచ్చిన నిధులు కాడాకు చేరుతాయి. అక్కడి నుంచి నీటి సంఘాలకు దామాషా ప్రకారం కాడా నిధులు కేటాయించాలి. నిధులు చేరకపోవడంతో మరమ్మతుల నిర్వహణ విష యంలో కాడా కూడా చేతులెత్తేసింది. ఏటా సాగర్‌ ఆయకట్టు పరిధిలో నీటి తీరువా ఏటా రూ.30 కోట్ల నుంచి రూ.31 కోట్లు వస్తుందని అంచనా. రైతులు చెల్లించే నీటి తీరువాపై ఈ నిధులు ఆధారపడి ఉంటాయి. ఈ నిధులు కాడాకు చేరకుండా నేరుగా ప్రభుత్వం ఖజానాకు జమ అవుతున్నాయి. నీటి తీరువా నిధులు దారి మళ్లించడంతో కాలువల నిర్వహణకు నిధుల కొరత ఏర్పడింది. ఏటా నీటి తీరువా నిధులు మరమ్మతులకు విడుదల చేసి ఉంటే కాలువలు ఇంత అధ్వానంగా ఉండేవి కాదని రైతులు చెబుతున్నారు. గత ఐదేళ్లుగా నీటి తీరువా నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోతుండటంతో రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే నిధుల మాట ఎలా ఉన్నా తాము చెల్లించే నీటి తీరువా నిధులైనా కేటాయిం చి అత్యవసర మరమ్మతులైనా చేపట్టాలని ఏటా రైతులు కోరినా ప్రభుత్వం పట్టించు కోలేదు. జూన్‌ నెలలో ఏర్పడే కొత్త ప్రభుత్వం అయినా కాలువలపై దృష్టి సారించి చివరి భూము లకు నీరు అందిచేలా కాలువలకు మరమ్మతులు చేప ట్టాలని అన్నదాతలు కోరుతున్నారు.

మరమ్మతులు శూన్యం

నాగార్జున సాగర్‌ కుడికాలువ పరిధిలోని మేజర్లు, మైనర్‌లు, సబ్‌మైనర్‌ కాలు వలు అధ్వాన స్థితికి చేరుకున్నాయి. సాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తను న్నాయి. కాలువలు కనీస మరమ్మతులకు నోచుకోలేదు. గుర్రపుడెక్క, జమ్ము, రబ్బరు మొక్కలు, కంపచెట్లు కాలువల నిండా పెరిగాయి. ఇవి నీటి సరఫరాకు అవరోధంగా మారాయి. మరమ్మతులు చేపట్టేం దుకు 212 పనులు గుర్తించి జలవనరుల శాఖ రూ.34 కోట్లకు వ్యయం అం చనాలను రూపొందించి ప్రభుత్వా నికి ప్రతిపాదనలు పంపగా నిధులు విడుదల చేయలేదు. దీంతో కాలువలు మరమ్మతు లకు నోచుకోలేదు.

షట్టర్లు లేక నీరు వృధా

కాలువల్లో కంప చెట్లు పెద్దఎత్తున పెరిగాయి. జమ్ము, తూటుకాడ, రబ్బరు మొక్కలు కాలువల నిండా అల్లుకుపోయాయి. డ్రాపులు పగిలిపోయాయి. షట్టర్లు కూగా దెబ్బ తిన్నాయి. పూర్తిగా అఽధ్వాన స్థితిలో కాలువలు ఉన్నాయి. షట్టర్లు లేక పోవడంతో సాగు నీరు వృధాగా వాగుల్లో పారుతోంది. దీని వలన అవసరం ఉన్నా లేకున్నా నీటి సరఫరా జరుగుతోంది. ఏటా 30 టీఎంసీల వరకు నీరు వృధా అవుతున్నట్టు అంచనా. నీటి వృధా ను అరికట్టేందుకు కాలువలకు షటర్ల ఏర్పాటు తక్షణావసరంగా ఉంది.

Updated Date - May 21 , 2024 | 01:07 AM