Share News

నృసింహునికి లోకేశ్‌, బ్రాహ్మణి ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:44 AM

మంగళగిరి నియోజకవర్గం నుంచి అఖండ మెజార్టీతో విజయం సాధించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎమ్మెల్యే హోదాలో తొలిసారిగా గురువారం సాయంత్రం మంగళాద్రి శ్రీలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు.

నృసింహునికి లోకేశ్‌, బ్రాహ్మణి ప్రత్యేక పూజలు
దిగువ సన్నిధిలో ధ్వజస్తంభం వద్ద పూజలు నిర్వహిస్తున్న నారా లోకేశ్‌, బ్రాహ్మణి దంపతులు

ఎగువ, దిగువ సన్నిధి ఆలయాల్లో స్వామి వారి దర్శనం

మంగళగిరి, జూన్‌6: మంగళగిరి నియోజకవర్గం నుంచి అఖండ మెజార్టీతో విజయం సాధించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎమ్మెల్యే హోదాలో తొలిసారిగా గురువారం సాయంత్రం మంగళాద్రి శ్రీలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. సతీమణి బ్రాహ్మణితో కలిసి నారా లోకేశ్‌ శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత దిగువ సన్నిధిలోని తూర్పు రాజగోపురం వద్ద దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎ.రామకోటిరెడ్డి, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ముఖండపంలో లోకేశ్‌, బ్రాహ్మణి దంపతులకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈవో రామకోటిరెడ్డి నృసింహుని చిత్రపటంతో కూడిన జ్ఞాపికను బహుకరించారు.

కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, నేతలు గుత్తికొండ ధనుంజయరావు, షేక్‌ రియాజ్‌, గాజుల శ్రీనివాసరావు, గోవాడ దుర్గారావు, సంకా బాలాజీగుప్తా, జొన్నాదుల బాలకృష్ణ, ఆకురాతి నాగేంద్రం, రంగిశెట్టి పెద్దబ్బాయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 12:44 AM