Share News

పిన్నెల్లిని వెంటనే అరెస్టు చేయాలి

ABN , Publish Date - May 24 , 2024 | 01:02 AM

ఈవీఎంలను ధ్వంసం చేసి ఇష్టానుసారంగా రౌడీయిజం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎలక్షన కమిషన, పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని తక్షణమే అరెస్టు చేయాలని గుంటూరు తూర్పు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్‌ నసీర్‌ డిమాండ్‌ చేశారు.

పిన్నెల్లిని వెంటనే అరెస్టు చేయాలి
ఆర్వో కీర్తి చేకూరికి వినతిపత్రం ఇస్తున్న నసీర్‌

గుంటూరు, మే 23(ఆంధ్రజ్యోతి): ఈవీఎంలను ధ్వంసం చేసి ఇష్టానుసారంగా రౌడీయిజం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎలక్షన కమిషన, పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని తక్షణమే అరెస్టు చేయాలని గుంటూరు తూర్పు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్‌ నసీర్‌ డిమాండ్‌ చేశారు. గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి కీర్తి చేకూరికి గురువారం ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పోస్టల్‌ బ్యాలెట్‌ ఎలా భద్రపరిచారో ఆమెను అడిగి తెలుసుకున్నారు. గుంటూరు తూర్పులో పోస్టల్‌ బ్యాలెట్‌ 3 వేలకు పైగా ఉన్నందున పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపునకు ప్రతి 500 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లకు ఒక టేబుల్‌ ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన కోరారు. ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకుంటానని ఆమె చెప్పారు. నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంలు భద్రపరిచిన సా్ట్రంగ్‌ రూమ్‌ పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు సంబంధించిన వెబ్‌ లింకును ఇవ్వాలని ఆయన ఆర్వోని కోరారు. సర్వీస్‌ ఓటుకి సంబంధించిన పోస్టల్‌ బ్యాలెట్లు భద్రపరిచేందుకు సా్ట్రంగ్‌ రూమును పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో సా్ట్రంగ్‌ రూమ్‌ తాళాలు తెరిచి సర్వీస్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ను భద్రపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్‌ గౌస్‌, జాగర్లమూడి శ్రీనివాస్‌, గోళ్ళ ప్రభాకర్‌, మహంకాళి నరసింహారావు, వేల్చూరి కిరణ్‌, దయారత్నం, హఫీజ్‌, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2024 | 01:02 AM